‘ప్రైవేట్’లో రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్‌లో పెట్టాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని సోషలిస్టు కూటమి రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం సోషలిస్టు కూటమి ఆధ్వర్యాన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. తొలుత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. టీయూఎస్సీ జాతీయ కార్యదర్శి ఎల్.జైబాబు మాట్లాడుతూ రిజర్వేషన్లు ఎత్తివేయాలనే వాదం ముందుకు వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలు ప్రైవేటులో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే రిజర్వేషన్లు తప్పనిసరి చేయాలన్నారు. సమావేశంలో గిద్దా శ్రీనివాస్, వేల్పూరి శ్రీనివాస్, దేవసేన, శీలం వెంకటేశ్వర్లు, బూరుగా రత్నం, గణేష్, దేవి, పిట్టా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు


