లక్ష్యాలను పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాలను పూర్తి చేయండి

Feb 18 2026 7:57 AM | Updated on Feb 18 2026 7:57 AM

లక్ష్

లక్ష్యాలను పూర్తి చేయండి

లక్ష్యాలను పూర్తి చేయండి ఆరోగ్య సూత్రాలు పాటించాలి చెస్‌తో ఆలోచనాశక్తి పెరుగుతుంది

చిలకలపూడి(మచిలీపట్నం): ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యం మేరకు వేగంగా పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రూ.108.44కోట్ల ఉపాధి హామీ పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.47కోట్ల మేరకు చేశారన్నారు. ఇందులో 43శాతం మేరకు బిల్లులను చెల్లింపు కోసం అప్‌లోడ్‌ చేశారన్నారు. మిగిలిన రూ. 61కోట్ల పనులను ఎట్టి పరిస్థితుల్లోనైనా మార్చి 15వ తేదీ లోగా పూర్తి చేసి, అందుకు సంబంధించిన బిల్లులను అప్‌లోడ్‌ చేయాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు మురిగిపోకుండా సకాలంలో సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డ్వామా పీడీ కె. శివప్రసాద్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ రమణరావు తదితరులు పాల్గొన్నారు.

పెనుగంచిప్రోలు: విద్యార్థి దశ నుంచే ఆరోగ్య సూత్రాలు పాటించటం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యపడుతుందని ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియ అన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆమె స్థానిక కేవీఆర్‌ జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి 1నుంచి 19ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్‌ మాత్రలు అందించాలన్నారు. చిన్నారుల్లో రక్తహీనత, పోషకాల లోపాలకు కారణమైన నులిపురుగులను నివారించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ఈమాత్రలు ఉపయోగపడతాయన్నారు. భోజనానికి ముందు, తరువాత, ఆడుకున్న తరువాత చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఆర్డీఓ కె. బాలకృష్ణ, తహసీల్దార్‌ ఎ శాంతిలక్ష్మి, వైద్యాధికారి నాగరాణి, హెచ్‌ఎం కె. జలజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మచిలీపట్నంఅర్బన్‌: క్రీడలు జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని, అవి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అడిషనల్‌ ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్‌ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి చెస్‌ పోటీలు నిర్వహించారు. జిల్లా క్రీడా అధికారి కె. ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి ఎంపికలో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 155మంది యువత పాల్గొన్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి పోటీలలో 16 మంది విజేతలు రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు ఎంపికయ్యారని వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 21, 22 తేదీలలో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పి.వి. ఫణి కుమార్‌, మైనార్టీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ హసీం బేగ్‌, చెస్‌ ఆర్గనైజేషన్‌ ఆర్బిట్రేటర్లు తదితరులు పాల్గొన్నారు.

సీబీఎస్‌ఈ ‘పది’ పరీక్షలు ప్రారంభం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. నగరంలోని వీపీ సిదార్థ విద్యాసంస్థ, పాతబస్తీలోని అట్కిన్సన్‌ హైస్కూల్‌ తదితర విద్యాసంస్థల్లో తొలి రోజు గణితం పరీక్షకు వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ పరీక్ష కొనసాగింది. మంగళవారం ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి ఏడో తేదీ వరకూ కొనసాగనున్నాయి. కాగా గణిత ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ప్రశ్నలు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

లక్ష్యాలను పూర్తి చేయండి 1
1/2

లక్ష్యాలను పూర్తి చేయండి

లక్ష్యాలను పూర్తి చేయండి 2
2/2

లక్ష్యాలను పూర్తి చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement