తిరువూరులో ఉద్రిక్తత.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా | Kolikapudi Srinivasa Rao Over Acton At Tiruvuru To Stop Municipal Chairman Election, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

తిరువూరులో ఉద్రిక్తత.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

May 19 2025 10:59 AM | Updated on May 19 2025 5:54 PM

Kolikapudi Srinivasa Rao Over Acton AT Tiruvuru

తిరువూరులో ఎన్నిక అప్‌డేట్‌.. 

విజయవాడ:

ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్

👉తిరువూరు మున్సిపాల్టీ ఛైర్ పర్సన్ ఎన్నికల్లో పోలీసులు టిడిపి కార్యకర్తల్లా వ్యవహరించారు

👉20 మంది సభ్యులున్న కౌన్సిల్ లో వైఎస్సార్‌సీపీ 17 , టిడిపి 3 గెలిచింది

👉ఉపఎన్నిక నేపధ్యంలోవైఎస్సార్‌సీపీ అభ్యర్ధినే గెలిపించాలనివైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు

👉టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్,టిడిపి గూండాలు గుంపులుగా వచ్చారు

👉మా పై దాడిచేసేందుకు టిడిపి నేతలకు పోలీసులు మద్దతిచ్చారు

👉మా పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలను పోలీసులే కిడ్నాప్ చేశారు

👉ఇంతకంటే నీచంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యవహరించదు

👉స్వచ్ఛంధంగా వైఎస్సార్‌సీపీకి మద్దతిస్తున్నానని చెప్పినా నిర్మలను లాక్కెళ్లారు

👉ఛైర్మన్ పదవి కోసం చంద్రబాబు దగ్గర్నుంచి టిడిపి ఎమ్మెల్యే వరకూ అందరూ దిగజారిపోయారు

👉ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు

👉రేపటి ఎన్నిక సజావుగా జరపాలని ఎన్నికల కమిషనర్ ను కోరాం

👉రేపు మా కౌన్సిలర్లకు భద్రత కల్పించమని కోరాం 

 

👉కూటమి కుట్రలతో తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా. 

👉వైఎ‍స్సార్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేసిన కూటమి నేతలు. పోలీసులు సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై టీడీపీ మూకల దాడులు. ఎన్నిక జరగకుండా కూటమి నేతల వ్యూహం. అల్లర్లు సృష్టించిన పచ్చ నేతలు

👉తిరువూరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హల్‌చల్‌ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరుకాకుండా దాడికి యత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై చెప్పులు విసిరి, బాటిళ్లు విసురుతూ టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. 

👉తిరువూరులో పోలీసులు, టీడీపీ దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు రోడ్డుపై భైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

👉టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని చోద్యం చూస్తూ పోలీసులు అక్కడే నిలబడ్డారు. ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతల వ్యూహానికి పోలీసులు సహకరిస్తున్నారు. రౌడీయిజం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టలేదు. బలం లేకపోయినా రౌడీయిజంతో గెలవడానికి టీడీపీ అల్లర్లు. తిరువూరులో టీడీపీ ఉద్రిక్తత సృష్టిస్తోంది.

👉తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓవరాక్షన్‌కు దిగారు. ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు.

👉తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హల్‌చల్‌ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్‌సీపీ నేతలను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ కొలికపూడి, టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ వారినే బెదిరిస్తూ లోపలికి దూసుకెళ్లారు. దీంతో, వాగ్వాదం జరిగింది.

👉మరోవైపు.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు మద్దతుగా పార్టీ నేతలు దేవినేని అవినాష్, మొండితోక అరుణ్ కుమార్, నల్లగట్ల స్వామిదాస్, షేక్ ఆసిఫ్  తిరువూరు చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. నేడు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తో​ంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి ఓవరాక్షన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement