మాజీ మంత్రి జోగి రమేష్‌కు వైఎస్‌ జగన్‌ ఫోన్‌ | Ys Jagan Called Former Minister Jogi Ramesh | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి జోగి రమేష్‌కు వైఎస్‌ జగన్‌ ఫోన్‌

Feb 1 2026 8:33 PM | Updated on Feb 2 2026 7:34 AM

Ys Jagan Called Former Minister Jogi Ramesh

సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి జోగి రమేష్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ చేశారు. జోగి రమేష్‌ను పరామర్శించిన వైఎస్‌ జగన్‌.. జోగి రమేష్‌ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న ఆయన.. ప్రశ్నించేవారిని భయపెట్టడానికే చంద్రబాబు హింసాజ్వాలను రాజేస్తున్నారని మండిపడ్డారు. అవే మంటలు చంద్రబాబు సర్కార్‌ను దహించి వేయక తప్పదన్నారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందంటూ జోగి రమేష్‌కు వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు.

ఏపీలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై టీడీపీ గూండాల దాడికి పాల్పడారు. ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ గూండాల యత్నించారు. జోగి రమేష్‌ ఇంటికి నిప్పు పెట్టారు. జోగి రమేష్ నివాసంపై దాడి వెనుక కుట్ర బట్టబయలైంది. మాజీ మంత్రి నివాసంపై టీడీపీ పథకం ప్రకారం దాడికి పురిగొల్పింది. జోగి నివాసంపై దాడికి పిలుపునిచ్చిన టీడీపీ.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిరసన పేరుతో ప్లాన్‌ అమలు చేసింది.

అధికారికంగా పత్రికా ప్రకటన ఇచ్చిన ఇబ్రహీంపట్నం టీడీపీ అధ్యక్షుడు.. ఆందోళనకు పిలుపునిచ్చారు. అదే సమయంలో జోగి రమేష్‌ ఇంటివద్దకు చేరిన టీడీపీ నేతలు, గూండాలు.. ఆయన నివాసంపై కర్రలు, రాడ్లు, కత్తులు, పెట్రోల్ బాంబ్‌లతో దాడి చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement