‘ మీ దుష్ప్రచారాలను తిప్పికొడితే దాడులు చేస్తారా?’ | YSRCP Leader Kakani Takes On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘ మీ దుష్ప్రచారాలను తిప్పికొడితే దాడులు చేస్తారా?’

Feb 1 2026 7:42 PM | Updated on Feb 1 2026 7:55 PM

YSRCP Leader Kakani Takes On Chandrababu Naidu

నెల్లూరు:  సీఎం చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతుంటే దాడులకు పాల్పడతారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. తిరుమల లడ్డూలో  కల్తీ జరిగిందని గతంలో చంద్రబాబు మాట్లాడరని,  సీబీఐ రిపోర్ట్‌ ప్రకారం అందులో ఎలాంటి కొవ్వు లేదని స్పష్టమైందన్నారు.  దాంతో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని తేటతెల్లమైందన్నారు. 

చంద్రబాబు వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అనుకున్న విధంగా రిపోర్ట్‌ రాలేదని ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను బలి పశువును చేశారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబపై హత్యాయత్నం చేస్తారా? అని నిలదీశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement