సాక్షి, అమరావతి: అధికార టీడీపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మధ్య వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ కేశినేని బాధితుల సమావేశానికి కొలికపూడి హాజరవుతుండటం వీరి మధ్య పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది.
అయితే, టీడీపీ ఎంపీ కేశినేని బాధితులు నవంబర్ రెండో తేదీన హైదరాబాద్‌లో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హాజరవుతుండటం ఆసక్తికరంగా మారింది. కాగా, ఇప్పటికే కేశినేని చిన్నిపై కొలికపూడి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా చిన్ని బాధితులతో సమావేశం కావాలని నిర్ణయించడంతో టీడీపీలో దుమారం రేగుతోంది.
కొలికపూడి సంచలన ఆరోపణలు..
ఇదిలా ఉండగా.. అంతకుముందు కేశినేని చిన్నిపై కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు. చిన్ని 150 కోట్లు జనం డబ్బు ఎగనామం పెట్టారు. బాధితులకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు. తిరువూరులో కిషోర్.. ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదాం. అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదాం. తాడోపేడో తేల్చుకుంటా’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా గురువారం పోస్టు పెట్టారు. 2024 ఎన్నికల్లో చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఈ సొమ్మును ఆయనకు ఇచ్చానని ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, మరుసటి రోజు మరో రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు తదుపరి చిన్ని పీఏ మోహన్‌కు రూ.50 లక్షలు, గొల్లపూడిలో తన మిత్రుల ద్వారా రూ.3.50 కోట్లు ఇచ్చానని వివరించారు. ‘ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి. నిజమే గెలవాలి’ అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేపింది.

అంతేకాకుండా.. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు. చిన్ని 150 కోట్లు జనం డబ్బు ఎగనామం పెట్టారు. బాధితులకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు. తిరువూరులో కిషోర్.. ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదాం. అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదాం. తాడోపేడో తేల్చుకుంటా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాల నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది.
టీడీపీలో కోవర్టులున్నారు..
టీడీపీలో కోవర్టులు ఉన్నారని.. ఆ కోవర్టులు ఎవరో, ఎక్కడున్నారో అందరికీ తెలుసని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల జన్మదినాల స్టేటస్‌లు పెట్టుకుంటూ.. పార్టీకి విధేయుడినంటే కార్యకర్తలు ఒప్పుకుంటారా అంటూ ఎంపీ రెచ్చిపోయారు. నాయకుల కోసం పార్టీ శ్రేణులు దెబ్బలు తినాలి గానీ నేతలు మాత్రం ఇతర పార్టీలతో అంటకాగితే ఎవరైనా ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు. ‘తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకే వార్నింగ్‌లు ఇచ్చారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస విషయాలు తెలియకుండా అన్ని వివాదాలకూ కారణమవుతున్నారు’ అంటూ కొలికపూడిపై ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లిందని ఎంపీ వ్యాఖ్యానించారు.


