breaking news
kesineni
-
టీడీపీలో వివాదాల టెన్షన్.. చంద్రబాబు సైలెంట్?
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్‌కు టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా టీడీపీలో నేతల వరుస వివాదాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తలపట్టుకుంటున్న సమాచారం. మొన్న కొలికపూడి.. నిన్న సుధా మాధవి ఆరోపణలతో టీడీపీలో ఆందోళన మొదలైంది. నేతల ఆరోపణలపై టీడీపీ అధిష్టానం నోరు మెదపకపోవడం గమనార్హం.అధికార టీడీపీలో సీటుకు కోట్లు ఆరోపణలు సంచలనంగా మారాయి. రైల్వే కోడూరు టికెట్ ఇప్పిస్తానని టీడీపీ ఎన్ఆర్ఐ నేత వేమన సతీష్ తన వద్ద రూ.7 కోట్లు తీసుకున్నారని టీడీపీ కార్యకర్త సుధా మాధవి రోదించారు. ఆస్తులు, ఇల్లు అమ్ముకుని అప్పులు పాలై పోయామంటూ ఆవేదన చెందారు. సమస్య చెప్పుకునేందుకు కార్యాలయానికి వెళితే నంబర్‌లేని కారులో నా భర్తను, నన్ను తీసుకెళ్లిపోయారు. తనను కిడ్నాప్ చేశారని తెలిపారు. తమకు ప్రాణహని ఉందని కన్నీరు పెట్టుకున్నారు. కాగా, సుధా మాధవి ఆరోపణలపై టీడీపీ సైలంట్‌గా ఉంది.మరోవైపు.. కేశినేని చిన్ని దందాల చిట్టాను టీడీపీ క్రమశిక్షణ కమిటీకి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇచ్చారు. ఎన్నికల్లో సీటు కోసం 5 కోట్లు ఇచ్చిన లెక్కలు వివరించారు. కేశినేని చిన్ని మంత్రి లోకేష్ పేరు చెప్పి చేస్తున్న పనులను కూడా వెల్లడించారు. తిరువూరులో గంజాయి, మద్యం, రేషన్, ఇసుక దందాలలో కేశినేని చిన్ని పాత్రపై ఆరోపణలు చేశారు. పార్టీ పదవులు కేశినేని చిన్ని అమ్ముకున్నారని కమిటీకి కొలికపూడి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొలికపూడి ఆరోపణలపై కమిటీకి ఎంపీ కేశినేని చిన్ని వివరణ ఇచ్చారు. అనంతరం, కొలికపూడి కోవర్టు అంటూ చిన్ని ఆరోపించారు. ఈ ఎపిసోడ్లో రంగంలోకి దిగిన ఎల్లో మీడియా తన వంతుగా కొలికపూడిదే తప్పు అంటూ ఎంపీని రక్షించే ప్రయత్నం చేస్తోంది. కొలికపూడి ఎపిసోడ్ టీడీపీని టెన్షన్ పెడుతున్న సమయంలో సుధా మాధవి విషయం బయటకు రావడంతో పచ్చ పార్టీలో ఆందోళన మొదలైంది. అధికార కూటమి వరుస వివాదాలు బయటకు వస్తున్నప్పటికీ టీడీపీ, చంద్రబాబు మాత్రం ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం. -
లోకేష్ టైం ఇవ్వలేదు.. నిరాశగా వెనుదిరిగిన కొలికపూడి
సాక్షి,అమరావతి: టీడీపీలో కొలికపూడి వర్సెస్ చిన్ని రచ్చ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి,చిన్ని హాజరయ్యారు. నివేదికను క్రమశిక్షణ కమిటీకి కొలికపూడి అందించారు. పార్టీ పదవుల అమ్మకాలపై కొలికపూడి ఫిర్యాదు చేశారు.తిరువూరు సీటు కోసం చిన్నికి ఇచ్చిన రూ.5 కోట్ల వివరాలను అందించారు. చిన్ని పీఏ అక్రమాలపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మంత్రి నారా లోకేష్‌ను కలిసేందుకు కొలికపూడి ప్రయత్నించారు. అందుకు లోకేష్ టైం ఇవ్వకపోవడంతో కొలికపూడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.గత నెల అక్టోబర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా గురువారం పోస్టు పెట్టారు. 2024 ఎన్నికల్లో చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఈ సొమ్మును ఆయనకు ఇచ్చానని ప్రకటించారు.2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, మరుసటి రోజు మరో రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు తదుపరి చిన్ని పీఏ మోహన్‌కు రూ.50 లక్షలు, గొల్లపూడిలో తన మిత్రుల ద్వారా రూ.3.50 కోట్లు ఇచ్చానని వివరించారు. ‘ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి. నిజమే గెలవాలి’ అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేపింది. ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాల నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. టీడీపీలో కోవర్టులున్నారు: టీడీపీలో కోవర్టులు ఉన్నారని..ఆ కోవర్టులు ఎవరో, ఎక్కడున్నారో అందరికీ తెలుసని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల జన్మదినాల స్టేటస్లు పెట్టుకుంటూ.. పార్టీకి విధేయుడినంటే కార్యకర్తలు ఒప్పుకుంటారా అంటూ ఎంపీ రెచ్చి పోయారు. నాయకుల కోసం పార్టీ శ్రేణులు దెబ్బలు తినాలి గానీ నేతలు మాత్రం ఇతర పార్టీలతో అంటకాగితే ఎవరైనా ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు.‘తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకే వార్నింగ్‌లు ఇచ్చారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస విషయాలు తెలియకుండా అన్ని వివాదాలకూ కారణమవుతున్నారు’ అంటూ కొలికపూడిపై ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లిందని ఎంపీ వ్యాఖ్యానించారు.ఇలా ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కామెంట్స్‌తో టీడీపీలో పాలిటిక్స్ రచ్చ పీక్ స్టేజీకి చేరింది. ఈ క్రమంలో కొలికపూడి,కేశినేని చిన్న ఇద్దరూ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో కొలికపూడి నారాలోకేష్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తదుపురి భవిష్యత్ కార్యచరణపై కొలికపూడి దృష్టిసారించినట్లు తిరువూరు పొలిటికల్ సర్కిళ్ల చర్చ కొనసాగుతోంది. -
ష్.. బయటకు మాట్లాడొద్దు
సాక్షి, అమరావతి: పార్టీకి సంబంధించి ఏ విషయం బహిరంగంగా మాట్లాడవద్దని, మీడియా, సోషల్ మీడియాలోనూ వాటి ప్రస్తావన తేవద్దని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం సూచించినట్టు తెలిసింది. ఏవైనా అభ్యంతరాలు, ఇబ్బందులు ఉంటే తమకు చెప్పాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు ఇటీవల తీవ్రస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు పలు ఆరోపణలు చేసుకున్నారు. తన వద్ద ఎమ్మెల్యే సీటు కోసం ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్టు తీసుకున్నట్టు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వెల్లడించడంతో టీడీపీ అధిష్ఠానం ఉలిక్కిపడింది. పార్టీకి సంబంధించిన మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయనే ఆందోళనతో చంద్రబాబు కొలికపూడితో మాట్లాడారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య సర్దుబాటు చేయాలని క్రమశిక్షణ సంఘానికి సూచించారు. దీంతో సంఘం సభ్యులైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నేతలు వర్ల రామయ్య, పంచుమర్తి అనూరాధ, కొనకళ్ల నారాయణ మంగళవారం ఉదయం కొలికపూడిని పిలిచి మాట్లాడారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాల గురించి కొలికపూడి వారి వద్ద ఏకరువు పెట్టినట్టు తెలిసింది. ఎమ్మెల్యేనైనా తనకు నియోజకవర్గంలో ఎటువంటి అధికారాలు లేకుండా చేశారని, నియామకాలు, కార్యక్రమాలు, పనులన్నింటిలో ఎంపీ జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఎంపీ చిన్ని తిరువూరు నియోజకవర్గంలో చేసిన అవినీతి వ్యవహారాలు, తనకు తెలియకుండా చేపట్టిన పనులు, నియామకాలు వంటి అన్నింటి గురించి లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారు. ఆ లేఖ తీసుకున్న క్రమశిక్షణ సంఘం సభ్యులు ఇకపై ఏ విషయం బయట మాట్లాడకూడదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. ఎంపీ తన నియోజకవర్గంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించగా.. దానికి సమాధానం దాటవేసిన సభ్యులు.. పార్టీ చెప్పినట్టు వినాలని చెప్పారు. దీంతో కొలికపూడి ఆగ్రహంతో బయటకు వచ్చారు. తన అనుచరులతో కూడా మాట్లాడకుండా ఒంటరిగానే కారులో వెళ్లిపోయారు. ఆ తర్వాత కేశినేని చిన్ని కమిటీ సభ్యులను కలిసి తన వాదన వినిపించారు. తన పరిధిలోని ఎమ్మెల్యేలు కొందరు పార్టీకి నష్టం చేస్తున్నారని చెప్పారని, కొలికపూడికి స్థానిక పార్టీతో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పినట్టు తెలిసింది. ఇకపై ఇద్దరూ బహిరంగంగా మాట్లాడకూడదని చెప్పిన సంఘం నేతలు నివేదికను చంద్రబాబుకు ఇస్తామని, ఆ తర్వాత తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. లోకేశ్ ఎంట్రీ మరోవైపు తన నివాసంలో ప్రజాదర్బార్ పేరుతో ప్రజల నుంచి వినతులు తీసుకునే సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్ మంగళవారం మాత్రం పార్టీ కార్యాలయానికి వచ్చి వినతులు తీసుకున్నారు. తన అనుయాయుడైన విజయవాడ ఎంపీ చిన్ని క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై వివరణ ఇచ్చే సమయంలో ఎన్నడూ లేనివిధంగా లోకేశ్ పార్టీ కార్యాలయానికి రావడం చర్చనీయాంశమైంది. చిన్నికి మద్దతుగానే ఆయన మంగళవారం తన కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. -
కృష్ణా టీడీపీలో కొలికపూడి మంటలు
కృష్ణా జిల్లాలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రేపిన మంటలు తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసుకు తాకాయి. అయితే దాన్ని ఎలా సరిదిద్దాలి.. ఏమి చేయాలన్నదానిమీద చంద్రబాబు.. లోకేష్ మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని) , తిరువూరు (ఎస్సి) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇద్దరూ తొలిసారి గెలిచినవారే. అయితే తననుంచి రూ. 5 కోట్లు తీసుకుని టిక్కెట్ ఇచ్చారు అంటూ కొలికపూడి అటు ఎంపీ మీద ఆరోపణలు చేసారు. ఆంతే కాకుండా తాము డబ్బులిచ్చి తిరువూరు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కొన్నామని, దీంతోబాటు చిన్ని అనుచరులు చేయని దందా లేదని.. ఇసుక.. లిక్కర్.. గంజాయి వంటి అన్నిరకాల అనైతిక పనులకు సైతం వాళ్ళే కేంద్రకం అంటూ దుమారం రేపారు. అయితే పిల్లల ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉన్న నీకు ఐదు కోట్లు ఎక్కడివి.. నిన్ను ఎవరు వెనకనుంచి నడిపించారు.. నువ్వు ఎవరికీ బినామీవి అంటూ ఇటు చిన్ని ఆఫీసు నుంచి ఎదురుదాడి మొదలైంది. మొత్తానికి టీడీపీ నాయకులూ ఇద్దరూ వీధినపడి కొట్టుకుంటూ పార్టీ పరువును బజారుకు ఈడ్చారు అని చంద్రబాబు సీరియస్ అయ్యారు.. ఇద్దరిమీదా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనవసరంగా వారికి టిక్కెట్లు ఇచ్చాను అంటూ చిరుకోపం ప్రదర్శించారు.. అయితే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇంకా సస్పెన్స్.. అయితే వీరిద్దరూ ఈనెల నాలుగున క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.కొలికపూడి మీద చర్యలుంటాయా ?గతంలో హద్దు మీరి ప్రవర్తించి ఏకంగా లైంగికంగా మహిళా కార్యకర్తలను వేధించిన ఆరోపణల్లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. అయన తనను వేధించారని, వ్యక్తిగతంగా కలవాలని చెప్పేవారని.. అయన తీరుతో తాను విసిగిపోయానని పార్టీ మహిళా కార్యకర్త ఒకరు చేసిన ఆరోపణలు.. దానికి సంబంధించిన ఆడియో ఆధారాలు కలిపి బయటకు రావడంతో పార్టీ అధిష్టానం ఆయన్ను సస్పెండ్ చేసింది. నకిలీ మద్యం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలమీద తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జ్ జయచంద్రారెడ్డిని, మరో నేత సురేంద్ర నాయుడుని సైతం పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. అయితే ఇప్పుడు పార్టీ క్రమశిక్షణ లైన్ దాటి అపరిమిత స్వేచ్ఛను తీసుకుని ఏకంగా ఎంపీ మీద అవినీతి ఆరోపణలు చేసిన శ్రీనివాస్ ను ఏం చేస్తారన్న ఉత్కంఠ పార్టీ క్యాడర్లో నెలకొంది.లోకేష్ జపంతో గట్టెక్కనున్న చిన్నిఇదిలా ఉండగా చిన్ని మాత్రం తనకు ఏమీ కాదని దిలాసాగా ఉన్నారు. తనకు లోకేష్ మద్దతు.. ఆశీస్సులు ఉన్నాయని.. అయన బలంతోనే తాను టిక్కెట్ తెచ్చుకున్నానని చెబుతున్నారు. అలాంటి తనను ఈ నిబంధనలు, క్రమశిక్షణ సంఘం ఏమీ చేయలేదని అంటున్నారు. తానూ అధిష్టానానికి అతీతుణ్ణి అనే కాన్ఫిడెన్స్ తో ఉంటున్నారు. దీనికి అనుగుణంగా అయన ప్రస్తుతం జరిగే అన్ని సభలు.. సమావేశాల్లోనూ లోకేష్ ను ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఏ మంచి జరిగినా దానికి లోకేష్ కమిట్మెంట్ .. అయన కృషి.. చిత్తశుద్ధి ఇవే కారణం అంటూ భజన చేస్తూ ఉన్నారు. లోకేష్ కనుసన్నల్లో ఉంటె చాలు తనకు పార్టీలో ఎలాంటి అడ్డంకులు ఉండవని అయన ధీమాగా ఉంటున్నారు. లోకేష్ నామస్మరణ తనకు శ్రీరామా రక్ష అని అయన నమ్ముతున్నారు. దీంతో అయన ఆ మంత్రోచ్చారణద్వారా ఈ వివాదం నుంచి గట్టెగ్గగలలని నమ్ముతున్నారు. ఇక దళితుడైన కొలికపూడి మాత్రం ఏం చేయాలో పాలుపోక డిఫెన్స్ లో పడ్డారు.. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి రేపు మంగళవారం పార్టీ క్రమశిక్షణ సంఘం వద్ద వారు తమ వాదనలు.. వివరణలు ఇవ్వనున్నారు.. సిమ్మాదిరప్పన్న -
‘హైదరాబాద్‌లో టీడీపీ ఎంపీ చిన్ని పాపాలన్నీ రోడ్డెక్కేశాయ్’
సాక్షి,అమరావతి: హైదరాబాద్‌లో టీడీపీ ఎంపీ చిన్ని పాపాలన్నీ రోడ్డెక్కేశాయని మాజీ మంత్రి పేర్నినాని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్,ఎంపీ కేశినేని చిన్ని వివాదంపై పేర్నినాని స్పందించారు.ఈ సందర్భంగా కేశినేని చిన్నికి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ను టీవీలో తప్ప నేనెప్పుడూ చూడలేదు.కేసినేని చిన్ని మునిగిపోతున్న నావ మాదిరి కనిపిస్తున్నాడు. జగ్గయ్యపేట,నందిగామలో ఇసుకను కూడా లాగేసుకున్నారు. దేవాదాయ భూముల్లో ఎగ్జిబిషన్ పెట్టి పీకల్లోతు మునిగిపోయాడు. హైదరాబాద్‌లో చిన్ని పాపాలన్నీ రోడ్డెక్కేశాయి’అని వ్యాఖ్యానించారు. -
పార్టీ పదవులు చిన్ని అమ్ముకున్నాడని ఆరోపించిన కొలికపూడి
-
ఎంపీ కేశినేని చిన్నికి ఝలక్.. కొలికపూడి సంచలన నిర్ణయం
సాక్షి, అమరావతి: అధికార టీడీపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మధ్య వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ కేశినేని బాధితుల సమావేశానికి కొలికపూడి హాజరవుతుండటం వీరి మధ్య పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది.అయితే, టీడీపీ ఎంపీ కేశినేని బాధితులు నవంబర్ రెండో తేదీన హైదరాబాద్‌లో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హాజరవుతుండటం ఆసక్తికరంగా మారింది. కాగా, ఇప్పటికే కేశినేని చిన్నిపై కొలికపూడి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా చిన్ని బాధితులతో సమావేశం కావాలని నిర్ణయించడంతో టీడీపీలో దుమారం రేగుతోంది.కొలికపూడి సంచలన ఆరోపణలు.. ఇదిలా ఉండగా.. అంతకుముందు కేశినేని చిన్నిపై కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు. చిన్ని 150 కోట్లు జనం డబ్బు ఎగనామం పెట్టారు. బాధితులకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు. తిరువూరులో కిషోర్.. ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదాం. అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదాం. తాడోపేడో తేల్చుకుంటా’ అంటూ వ్యాఖ్యలు చేశారు.టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా గురువారం పోస్టు పెట్టారు. 2024 ఎన్నికల్లో చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఈ సొమ్మును ఆయనకు ఇచ్చానని ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, మరుసటి రోజు మరో రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు తదుపరి చిన్ని పీఏ మోహన్‌కు రూ.50 లక్షలు, గొల్లపూడిలో తన మిత్రుల ద్వారా రూ.3.50 కోట్లు ఇచ్చానని వివరించారు. ‘ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి. నిజమే గెలవాలి’ అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేపింది.అంతేకాకుండా.. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు. చిన్ని 150 కోట్లు జనం డబ్బు ఎగనామం పెట్టారు. బాధితులకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు. తిరువూరులో కిషోర్.. ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదాం. అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదాం. తాడోపేడో తేల్చుకుంటా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాల నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. టీడీపీలో కోవర్టులున్నారు..టీడీపీలో కోవర్టులు ఉన్నారని.. ఆ కోవర్టులు ఎవరో, ఎక్కడున్నారో అందరికీ తెలుసని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల జన్మదినాల స్టేటస్లు పెట్టుకుంటూ.. పార్టీకి విధేయుడినంటే కార్యకర్తలు ఒప్పుకుంటారా అంటూ ఎంపీ రెచ్చిపోయారు. నాయకుల కోసం పార్టీ శ్రేణులు దెబ్బలు తినాలి గానీ నేతలు మాత్రం ఇతర పార్టీలతో అంటకాగితే ఎవరైనా ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు. ‘తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకే వార్నింగ్‌లు ఇచ్చారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస విషయాలు తెలియకుండా అన్ని వివాదాలకూ కారణమవుతున్నారు’ అంటూ కొలికపూడిపై ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లిందని ఎంపీ వ్యాఖ్యానించారు. -
Kolikapudi Srinivasa Rao: చిల్లర మాటలు ... 5 లోకేష్ కు అంతా తెలుసు
-
Kesineni: ఎమ్మెల్యే సీటుకు 5 కోట్లా కొలికపూడి ఒక దొంగ..
-
‘ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారు’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన విషయాలు బయటపెట్టారు. కేశినేని చిన్నికి సంబంధించిన ఆధారాలను కొలికపూడి బయటపెట్టారు. రూ.5 కోట్లు తీసుకుని తనకు తిరువూరు టికెట్ ఇచ్చారన్న కొలికపూడి.. సంచలన ఆధారాలను బయటపెట్టారు.2024 ఎన్నికల్లో కేశినేని చిన్ని నన్ను ఐదు కోట్లు అడిగాన్న కొలికపూడి.. తన అకౌంట్ నుంచి ఎవరెవరికి ఎంత ట్రాన్స్ఫర్ చేశారో ఆయన బయటపెట్టారు. ‘‘2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. 2024 ఫ్రిబవరి 8న మరో రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. 2024 ఫిబ్రవరి 14న రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. కేశినేని చిన్ని పీఏ మోహన్‌కు రూ. 50 లక్షలు.. గొల్లపూడిలో నా మిత్రుల ద్వారా రూ.3.5 కోట్లు ఇచ్చా.. ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం’’ అంటూ కొలికపూడి సంచలన పోస్టు పెట్టారు. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు సంచలనంగా మారింది.మరోవైపు.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. ‘‘తిరువూరులో దొంగే దొంగ అని అరుస్తున్నాడు. నాపై విమర్శలు చేసిన వాళ్లు సాక్ష్యాలు ఇవ్వాలి. నేను డబ్బులు సంపాదించుకోవాలంటే తిరువూరు వరకూ రావాల్సిన అవసరం లేదు. తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారశైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లాయి’’ అని చిన్ని వ్యాఖ్యానించారు. -
Pothina: నకిలీ మద్యంలో సుజనా చౌదరి, కేసినేని చిన్నికి వాటాలు?
-
తిరువూరు టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై తిరువూరు తమ్ముళ్ల తిరుగుబాటు జెండా ఎగురవేశారు. టీడీపీ పార్టీని, ప్రభుత్వాన్ని, ఎంపీని ఎమ్మెల్యే కొలికపూడి అల్లరి చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎమ్మెల్యే.. పార్టీని, ఎంపీని బదనాం చేస్తున్నారు.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎమ్మెల్యేకి కనిపించడం లేదు.. ఎమ్మెల్యే వైఖరిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అంటూ మండిపడ్డారు.‘‘ఒక పథకం ప్రకారమే ఎమ్మెల్యే కొలికపూడి ఇలా చేస్తున్నారు. కొలికపూడితో వివాదాలన్నీ టీడీపీ వారితోనే. ఎమ్మెల్యే కొలికపూడి వల్ల టీడీపీ తీవ్రంగా నష్టపోతోంది. కొలికపూడిని ఎంపీ కేశినేని చిన్ని కోట్లు ఖర్చుపెట్టి గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి పార్టీకి, ఎంపీకి నమ్మకంగా ఉండాలి. ఏవైనా మనస్పర్థలు ఉంటే మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. తిరువూరులో పార్టీ, ప్రభుత్వం, ఎంపీ అల్లరవుతున్నారు తప్ప.. ఏం అభివృద్ధి జరిగింది’’ అంటూ తిరువూరు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.కాగా, తిరువూరు టీడీపీలో ఇసుక పంచాయతీ మళ్లీ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు బెదిరింపులకు దిగడం గమనార్హం. -
కొలికపూడి డ్రామా.. కేశినేని చిన్ని రివర్స్ డ్రామా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీలో కమీషన్ల పంచాయతీ రచ్చ రచ్చగా మారింది. ఇసుక, మట్టి, మద్యం అక్రమ రవాణా వాటాల్లో లెక్కలు బట్టబయలయ్యాయి. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య కమీషన్ల పంచాయితీ సాగుతోంది. ఎంపీ కేశినేని చిన్ని కనుసన్నల్లోనే ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండగా, ఎంపీ కేశినేని చిన్నికి ఎమ్మెల్యే కొలికపూడికి వాటాల్లో తేడా వచ్చింది. దీంతో ఎంపీ కేశినేని చిన్నిని కొలికపూడి పరోక్షంగా టార్గెట్‌గా చేశారు. చిన్ని అనుచరుడు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ హడావుడి సృష్టించారు.ఓ గిరిజన మహిళ పై లైంగిక వేధింపుల ఆడియో ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గిరిజన మహిళను వేధించిన రమేష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ కొలికపూడి డిమాండ్ చేస్తున్నారు. గిరిజన మహిళలతో తన ఇంటి ముందు ధర్నా చేయించుకున్న ఎమ్మెల్యే కొలికపూడి.. 48 గంటల్లో రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానంటూ కొలికపూడి అల్టిమేటం జారీ చేశారు. తనను కాపాడేందుకు రమేష్‌రెడ్డి ఎంపీ కేశినేని చిన్ని పీఏ కిషోర్‌కు నాలుగు ట్రాక్టర్లు, రూ.50 లక్షల నగదు ఇచ్చాడంటూ కొలికపూడి ఆరోపించారు.కాగా, కొలికపూడి డ్రామాకు ఎంపీ కేశినేని చిన్ని రివర్స్ డ్రామా నడిపారు. తమకు లోన్లు ఇప్పిస్తామంటే వచ్చామని కొలికపూడి ఇంటి వద్ద ధర్నా చేసిన గిరిజన మహిళలు అన్నారు. లోన్లు ఇప్పిస్తామని 300 రూపాయలు కూలీకి తమను తీసుకొచ్చారని మహిళలు చెబుతున్నారు. మరో వైపు, తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కొలికపూడిపై ఎంపీ అనుచరుడు రమేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.కొలికపూడికి ఎన్నికల సమయంలో 50 లక్షల ఆర్థిక సహాయం చేశానని.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనను రెండు కోట్లు అడిగారని.. మండలంలో కాంట్రాక్టులన్నీ తాననే చేసుకోమన్నారంటూ ఎంపీ అనుచరుడు ఆలవాల రమేష్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్ట్ పనుల్లో 10 శాతం కమిషన్ ఇస్తే చాలన్నారు. నేను రెండు కోట్లు ఇవ్వనందుకే ఎమ్మెల్యే కొలికపూడి నన్ను టార్గెట్ చేశారు. మహిళలను లోన్లు ఇప్పిస్తామని 300 రూపాయల కూలీకి తీసుకొచ్చి ధర్నా చేయించారు’’అని రమేష్‌రెడ్డి ఆరోపించారు. -
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. హైకమాండ్‌కు కొలికపూడి అల్టిమేటం
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌రావు వర్సెస్ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారం రచ్చకెక్కింది. ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్‌గా కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు.గిరిజన మహిళ పట్ల కేశినేని చిన్ని అనుచరుడు రమేష్‌రెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడు. రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుండా ఎంపీ అడ్డుకుంటున్నారు. 48 గంటల్లో రమేష్‌రెడ్డిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కొలికపూడి అల్టిమేటం జారీ చేశారు. -
టీడీపీలో ప్రమోషన్ ఎక్కువ.. పని తక్కువ..!
-
సీఎం జగన్ పై ప్రతిపక్షాలు అన్ని గుంపుగా చేరాయి: కేసినేని స్వేతి
-
దమ్ముంటే రా..చంద్రబాబుకు కేశినేని సవాల్
-
కేశినేని నాని పంచ్ లకు వణుకుతున్న టీడీపీ నేతలు
-
టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుంది: ఎంపీ కేశినేని నాని
సాక్షి, విజయవాడ: కాల్ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం కంచికచర్ల మండలం పెండ్యాలలో 70 లక్షల అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. కేశినేని చిన్ని వ్యాఖ్యలపై.. ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడుతానని అన్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దని, గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని తెలిపారు. ఇక.. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారని, నాయకుల పాత్ర తక్కువ ప్రజల పాత్ర ఎక్కువ అని తెలిపారు. రాజీనామా అనంతరం తన అనుచరులతో సమావేశం తర్వాతే వైఎస్సార్సీపీలో చేరాలని అనుకున్నానని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ పిలుపుతో వెంటనే వైఎస్సార్సీపీలో చేరినట్లు వెల్లడించారు. టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని అన్నారు. రాజకీయాల్లో తన స్థాయి చంద్రబాబు స్థాయి ఒక్కటేనని.. స్థాయిలో లోకేష్.. తన కంటే చాలా తక్కువని అన్నారు. కాల్ మనీ కార్యకలాపాలకు పాల్పడేవాళ్ల మాటలకు తాను సమాధానం చెప్పనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నానిలో పాటు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. చదవండి: అంబేద్కర్‌ను పచ్చ మీడియా అవమానించింది: ఆర్కే. రోజా -
పెద్దారెడ్డి టాక్స్ : సీటీ సిరగతాదేమో జాగర్త సిన్నీ!
ఓర్నాయనో.. అబ్బయ్యా సిన్నీ! మీ అన్నకి సెంద్రబాబు సీటీ సించేసే సరికి నీకు మహా కుశాలగా ఉన్నట్టుండాదే అబ్బయ్యా! ఇన్నేళ్లు సెంద్రబాబుకి ఊడిగం జేసిన మీ అన్నయ్యని మెడ బట్టుకోని బయటకి గెంటేసిన తర్వాత.. రాజ్జెమంతా నీదే అయిపోతాదని మురిసిపోతా వున్నట్టుండావు గదా. అప్పుడే నీకు ఎంపీ టిక్కెట్టు ఇచ్చేసినట్టు.. నువ్వు సైకిలెక్కి లగెత్తుకోని డిల్లీలో పార్లమెంటుకు పోయినట్టు కళ్లముందు సెవెంటీ ఎమ్మెమ్ములో కనిపిస్తా వున్నట్టుండాది గదా! అంతేలే అబ్బయ్యా.. యీ మాదిర్తో అరసేతిలో సొర్గాన్ని జూపించకపోతే.. ఆ సెంద్రబాబు మాత్తరం పార్టీని ఎట్టా నడుపుకుంటాళ్లే? యీ కలలు కొంచిం కట్టిపెట్టి.. నా మాటలు కొంచిం జాగర్తగా ఆలకించుకో అబ్బయ్యా! మీ అన్నకైనా నెత్తిన పదేళ్లు కిరీటం నిలబడినాది. నీ కాడికి వొస్తే.. అసలు ఎలచ్చను గంట మోగడానికి ముందుగాలే.. నీ సీటీ సిరిగిపొతాదేమో అని అనుమానంగా వుండాదబ్బయ్యా.. ఎట్టాగంటవా? అదే జెప్పబోతన్నా.. రొవ్వంత జాగర్తగా యినుకో! సెంద్రబాబు మీ అన్న నాని మీద పగబట్టినట్టుగా గెంటేసినాక ఏదో జగనన్న పంచన జేరినాడనుకో. అదాటుగా నువు సీన్లోకి బలే ఎంట్రీ ఇచ్చినావబ్బయ్యా! మా అన్న రెండు సార్లు గెలిస్తే.. అసలు ఆ ఎలచ్చన్లలో పన్జేసి గెలిపించింది నేనే అంటావుంటివి. ఏమోనబ్బా.. మా నెల్లూరు మీ బెజవాడకి శానా దూరం గదా. అందుకేగావాల నీ పేరు యిదివరలో యినబడలా! సరే, ‘గెలుపు అనే బిడ్డకి శానా మంది నాయినలుంటారని’ ఇంగ్లీసులో ఓ సామెతుండాదిలే. ఆ మాదిరిగా మీ అన్నయ్య గెలిస్తే అంతా నీ పెతాపమే అని జెప్పుకుంటా వుండావు. ఓకే! అన్నయ్యని బయటకి పంపేయగానే.. సెంద్రబాబుకు వత్తాసు ఏసుకోని శానా దుడుకు మాటలు అంటావుండావు. మీ అన్న నానికి అంత సీన్లేదని అంటావుండావు. ఆయన లేడు గనక.. బెజవాడ సీటుని నీ సేతుల్లో యేలుకో తమ్ముడా అని సెంద్రబాబు అనబోతాడని నీకు ఆసె గదా. ఆయన గొప్పదనం గూడా యిట్టాంటి ఆసెలు పుట్టించడమే గదా? మరైతే సీక్రేటు జెప్తా యిను.. సుజనా సౌదరి అనే పెద్దమడిసి నీకు ఎరుకే గదా! మీ సెంద్రబాబు తోలితేనే గదా ఆయన పొయ్యి పువ్వు పార్టీలో గూసోని ఆణ్నించి రాజకీయం జేస్తన్నాడు. ఆయనకీ సెంద్రబాబుకీ ఉండే బందం పైకి కనపడకపొయినా సరే.. ఫెవికాల్తో అతికించినదానికంటె గట్టిదేననే సంగతి నీగ్గూడా తెలుసు గదా. మరి తాజా తాజా కబుర్లు నీ సెవిలో పడినాయో లేదో! ఆ సుజనా సౌదరి అనే పెద్దమడిసి బెజవాడ ఎంపీ సీటు మీద కన్నేసినాడంట. ఎటూ పువ్వు పార్టీలో ఉన్నాడు గాబట్టి.. పువ్వు టిక్కెట్టు మీదనే పోటీ జేస్తాడనుకో… నీకు యిప్పుటికిప్పుడు అడ్డం రాబోయేదేమీ లే. కాపోతే.. పువ్వుతో సైకిలుకి, గాజుగ్లాసుకి ముడిపడతాదేమో అని కూడా ఆయనే లీకులు వదలతండాడు అబ్బయ్యా సిన్నీ! యినుకున్నావా?? అదేగానీ జరిగిందనుకో.. ఎంపీల వరకు గెలిసే సీట్లే గావాలని పువ్వు పార్టీవోళ్లు ఫిటింగు బెట్టకుండా వుంటారా? ఆముడి పడినా బెజవాడ పువ్వుకే సమర్పయామి అయిపోతాది. అప్పుడిక నీ బతుకు మూడుజెండాలు బుజాన యేస్కోని మళ్లీ వూరంతా తిరగతా వుండడమే. నీకొక దారీ దిక్కూ యెప్పుటికి దక్కతాదో యెవురికెరుక అబ్బయ్యా! ఒకేళ- పువ్వుతో సైకిలుకు ముడిపడలేదే అనుకో.. నీ బతుకు యింకా కనాగస్టంగా అయిపోతా దబ్బయ్యా! సెంద్రబాబు ఒక సేత్తో నీకు టికెటిస్తాడనుకుందాం. రెండో సేత్తో- రెండో కంటికి తెలీకుండా నీ యెనకాల గొయ్యి కూడా తవ్విపెడతాడు! గోయిందా గోయింద! ‘సీసీ.. అట్టా యెందుకు జేస్తాడు’ అని గీర మాటలు మాటాడబోక నాయినా! అదే మరి సెంద్రబాబు మంత్రాగం. నీలాంటోడు ఆయన్ని నమ్ముకోని యెప్పుటికీ యీ పంచనే పడుంటాడు. కానీ.. పువ్వు పార్టీలోకి సెంద్రబాబు సొరబెట్టిన సుజనా సౌదరి లాంటి పెద్దమడిసి గెలిస్తే.. ఢిల్లీలో గూసోని బాబు గారి పన్లన్నీ గుట్టుసప్పుడు గాకుండా సక్కబెడతా వుంటాడు గదా! అదొక్కటే యేముండాదిలే. లోపల్లోపల ఆ సౌదరికీ- సెంద్రబాబుకీ యెన్నిన్ని లుకలుకల బందాలుండాయో నేను నీకు జెప్పాల్నా అబ్బయ్యా..! నెల్లూరోణ్ని- నాకంటే.. బెజవాడోడివి- నీకే యిట్టాంటి లోగుట్టు కతలు మాబాగా తెలస్తాయి. కాదంటావా? కాబట్టి నాయినా సిన్నీ! అన్నియ్య పొయినాడని.. యిక రాజ్జెమంతా నువ్వే యేలుకోవచ్చునని మురిసిపోబాక. మిడిసిపడబోక. ‘యెన్నాల్లో యేసిన వుదయం.. ఇయ్యాలే ఎదురవుతోంటే..’ అని సాంగులూ గట్రా యేసుకోని పండగజేసుకోబాక. సెంద్రనీతి రాజకీయాల్లో యింకా యెన్నెన్ని టర్నింగులుండాయో.. యెన్నెన్ని లోయలుండాయో.. నీ కలలబండి యేడ కూలిపోబోతాదో.. తెలవదు గదా! అందుకే రొవ్వంత జాగర్తగా పో అబ్బయ్యా! యింకా నాకు తిరుగు లేదని యిసురుకుంటా తిరిగినావనుకో.. అన్నకు జేసిన మాదిరిగానే సెంద్రబాబు నీ సీటీ గూడా అవలీలగా సించేయగల్డు! ✍️నెల్లూరు పెద్దారెడ్డి -
టీడీపీలో ట్విస్ట్.. కేశినేని నానికి షాకిచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ చెక్ పెట్టింది. నానికి చంద్రబాబు గట్టి షాకిచ్చాడు. తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇంఛార్జ్‌ను హైకమాండ్ నియమించింది. అలాగే, కేశినాని తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబును ఆదేశించింది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్‌మీరాలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్చార్జి దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్‌ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్నీ గో బ్యాక్ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించగా, పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. జిందాబాద్, గో బ్యాక్ నినాదాలతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. -
టీడీపీ ఎంపీ కేశినేని నాని సోదరుల మధ్య మరోసారి వార్
-
దేవినేని వైఖరిపై గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు
-
ప్రైవేట్ బస్సులో 6కిలోల బంగారం చోరీ
నాయుడుపేట : నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద గురువారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ దొంగతనం జరిగింది. చెన్నైకి చెందిన ఓ బంగారు ఆభరణాల సంస్థలో పనిచేస్తున్న సెంథిల్, మహేందర్ అనే వ్యక్తులు నాలుగు రోజుల క్రితం 14 కిలోల బంగారు ఆభరణాలతో హైదరాబాద్‌కు వచ్చారు. పని ముగించుకుని కొంత బంగారం తీసుకుని వారు బుధవారం రాత్రి కేశినేని ట్రావెల్స్ బస్సులో చెన్నై బయలు దేరారు. గురువారం ఉదయం ఆ బస్సు నెల్లూరు జిల్లా నాయుడుపేట బస్టాండ్‌లో టిఫన్ కోసం బస్సు ఆగింది. అనంతరం తిరిగి బస్సు బయలుదేరుతుండగా సెంథిల్, మహేందర్ తమ బ్యాగ్ ఒకటి కనిపించటం లేదని బస్సు డ్రైవర్‌కు చెప్పారు. దీంతో బస్సు ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని, విచారణ ప్రారంభించారు. కనిపించకుండా పోయిన బ్యాగులో ఆరు కిలోల బంగారు ఆభరణాలున్నాయని సెంథిల్, మహేందర్ చెబుతున్నారు. సరిగ్గా బస్సు బయలుదేరే సమయానికి ఒక వ్యక్తి హడావిడిగా ఓ బ్యాగుతో బస్సు దిగి, కారులో వెళ్లిపోయాడని బస్సు క్లీనర్ పోలీసులకు తెలిపాడు. బస్సులోని ప్రయాణికుల వివరాలు సేకరించి పోలీసులు విచారణ చేపట్టారు. -
పవన్‌కు జై కొడదామా... లేదంటే...


