సాక్షి, ఎన్టీఆర్: తిరువూరు టీడీపీలో పార్టీ నేతలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టెన్షన్ పట్టుకుంది. తాజాగా ఎంపీ కేశినేని చిన్ని వర్గీయులకు కొలికపూడి ఊహించని షాకిచ్చారు. టీడీపీ నేతల దోపిడీని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. దీంతో, టీడీపీలో రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వర్గీయుల దోపిడీని బయటపెట్టారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎంపీ చిన్ని వర్గీయులకు షాకిచ్చారు. ఈ క్రమంలో విస్సన్నపేట మండల టీడీపీ నేతల దోపిడీని ప్రశ్నిస్తూ పోస్టులు సంధించారు.‘నువ్వు దేనికి అధ్యక్షుడివి ??? పేకాట క్లబ్ కా ???. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే.. నువ్వు నిజంగా రాయల్. కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్’ అని సటైర్లు వేశారు. దీంతో, తిరువూరులో కొలికపూడి వరుస పోస్టులు హాట్ టాపిక్‌గా మారాయి.


