సాక్షి, తాడేపల్లి: నేడు సీపీ బ్రౌన్ వర్ధంతి. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. సీపీ బ్రౌన్‌కు నివాళులు అర్పించారు. తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘భాషాభిమానానికి భౌతిక హద్దులు లేవని.. తన మాతృ భాష కంటే మన తెలుగును ఎక్కువగా ప్రేమించి భాషకు నూతన జీవం పోసిన అక్షర యోగి సీపీ బ్రౌన్. వేమన శతకాలు, పోతన భాగవతం, పలు పాత కావ్యాలు కాలగర్భంలో.. కలిసిపోతున్న సమయంలో తన సొంత డబ్బుతో వందలాది తెలుగు గ్రంథాలను ముద్రించి మనకు అందించిన మహనీయుడు’ అని ప్రశంసలు కురిపిస్తూ పోస్టు చేశారు.
భాషాభిమానానికి భౌతిక హద్దులు లేవని, తన మాతృ భాషకంటే మన తెలుగును ఎక్కువగా ప్రేమించి భాషకు నూతన జీవం పోసిన అక్షర యోగి సీపీ బ్రౌన్ గారు. వేమన శతకాలు, పోతన భాగవతం, పలు పాత కావ్యాలు కాలగర్భంలో కలిసిపోతున్న సమయంలో తన సొంత డబ్బుతో వందలాది తెలుగు గ్రంథాలను ముద్రించి మనకు అందించిన… pic.twitter.com/uwUwlZQfzm
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 12, 2025


