సాక్షి,తాడేపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ అన్నారు. చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో యాత్రికుల ప్రైవేట్ బస్సు లోయలో పడి పలువురు మృతిచెందారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.


