తుమ్మల సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు అందించాలి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : స్థానిక బృందావన్‌గార్డెనన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురు వారం తెలుగులెంక తుమ్మల సీతారామమూర్తి 23వ పురస్కార సభ నిర్వహించారు. తుమ్మల కళాపీఠం ఆధ్వర్యంలో జరగ్గా, సభకు డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించారు. డాక్టర్ ఏల్చూరి మురళీధరరావు (ఢిల్లీ)ను తుమ్మల కళాపీఠం అవార్డు, రూ.25 వేలు, దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం డాక్టర్ ఏల్చూరి మాట్లాడుతూ తుమ్మల సమగ్ర సాహిత్యాన్ని మరోమారు ప్రజలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. సంస్థ కార్యదర్శి సూర్యదేవర రవికుమార్ మాట్లాడుతూ తుమ్మల సీతారామమూర్తి జయంతిని ఏపీ ప్రభుత్వం నిర్వహించాలని అన్నారు. సభలో అప్పాజోస్యుల సత్యనారాయణ, అక్కిరాజు సుందరరామకృష్ణ, ఎస్‌వీఎస్.లక్ష్మీనారాయణ, వెన్నిశెట్టి సింగారావు, పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, పారా అశోక్, ముత్తేవి, భూసురపల్లి, నాగరాజ్యలక్ష్మీ, నాగసుశీల, దేశం పాపిరెడ్డి, బొల్లేపల్లి సత్యనారాయణ, నూతలపాటి తిరుపతయ్య సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు.


