ది కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ గుంటూరు బ్రాంచ్ ప్రార
కొరిటెపాడు (గుంటూరు వెస్ట్) : ఏలూరు జిల్లా, ఏలూరు టైన్ అగ్రహారంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, చిరు వ్యాపారుల ఆర్ధికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ 112 సంవత్సరాల చరిత్ర కలిగిన ది ఏలూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 8వ బ్రాంచ్ శాఖ ప్రారంభించడం అభినందనీయమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గురువారం గుంటూరులో హరిహర్ సినిమాస్ లైనులో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు, బ్యాంక్ డైరెక్టర్, బ్యాంక్ చైర్మన్ అంబిక ప్రసాద్ పాల్గొన్నారు.


