రెండో వైస్ ఎంపీపీగా అనూరాధ ఏకగ్రీవం
ఫిరంగిపురం: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల రెండో వైస్ ఎంపీపీగా అమర్లపూడి అనూరాధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల రెండో ఉపాధ్యక్షుడిగా ఉన్న జి. చంద్రం ఇటీవల మృతిచెందారు. దీంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడటంతో గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి వి.శంకర్ ప్రైసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. మండలంలో 18 మంది ఎంపీటీసీలకుగాను వైఎస్సార్‌సీపీకి చెందిన 15 మంది విజయం సాధించారు. కాగా బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్‌బాబు) ఆధ్వర్యంలో గుంటూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు మార్పుల శివరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తిరేణమ్మతోపాటు ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించారు. అందరి సమక్షంలో అమీనాబాద్ రెండు ఎంపీటీసీ సభ్యురాలు అమర్లపూడి అనూరాధను ఏకగ్రీవంగా ఎంపికచేసి బీ ఫాం అందజేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో అమీనాబాద్ –1 ఎంపీటీసీ గాంధీబుడే (చిన్నసుబాని).. అమీనాబాద్–2 ఎంపీటీసీ సభ్యురాలు అమర్లపూడి అనూరాధను ప్రతిపాదించారు. అమీనాబాద్–3 ఎంపీటీసీ సభ్యురాలు సకిల.లక్ష్మి బలపరిచారు. దీంతో సమావేశానికి హాజరైన ఎంపీటీసీ సభ్యులు వైస్ ఎంపీపీగా ఎ.అనూరాధను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల ప్రత్యేకాధికారి వి.శంకర్ ప్రకటించి పత్రాన్ని అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్నిక కార్యక్రమాలను ఎంపీడీవో పి.శివ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ కె.ప్రసాద్, వైస్ ఎంపీడీవో విష్ణువర్ధన్‌రావు, సూపరింటెండెంట్ రవిబాబు, సీఐ శివరామకృష్ణ, ఈవోపీఆర్డీ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. రెండో వైస్ ఎంపీపీ అనూరాధను పలువురు అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు మార్పుల శివరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తిరేణమ్మ, ఎంపీపీ షేక్, షహేలానర్గీస్, పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ హబీబుల్లా, వైస్ ఎంపీపీ–1 మార్పుల విజయలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు ఐ.సీతారామిరెడ్డి, కె. హనుమాయమ్మ, గాంధీబుడే, చేవూరి నాగవేణి, టి. పెదలక్ష్మయ్య, టి.విజయలక్ష్మి, పి.జోస్‌ఫిన్, పి.లక్ష్మయ్య, షేక్.ఖాసిం షహీద్, సకిల లక్ష్మి, సాలె సంధ్యారాణి, కో అప్షన్ మెంబర్ షేక్ సుబాని, నాయకులు కె.చిన్నప్పరెడ్డి, డి.సురేష్, షేక్ సలీం, డి.మెల్కియా, కె.అప్పిరెడ్డి, ఎ.రత్నం, మేడాబాబు, పి.రఘు, పెరికల చిన్న, స్వర్ణ, చిన్నప్ప, చేవూరి రామమోహన్‌రెడ్డి, చిట్టా అంజిరెడ్డి, సాల్మన్, సయ్యద్ సైదులు, షేక్ మస్తాన్ వలి, కె.ప్రవీణ్‌రెడ్డి, ఐ.హేమలతారెడ్డి, బద్దూరి శ్రీనివాసరెడ్డి, మీరావలి, కె.ఆనంద్, పి.వెంకటరామిరెడ్డి, సంజీవరెడ్డి, పుల్లారావు, కె.శ్రీనివాసరెడ్డి, మోరంరెడ్డి, ఎం.జోజి, డి,నరేంద్రకుమార్, ఎం.శ్రీనివాసరెడ్డి, టి.కృష్ణ. రామారావు,ఎస్.రాయప్ప, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


