సాక్షి,అమరావతి: హైదరాబాద్‌లో టీడీపీ ఎంపీ చిన్ని పాపాలన్నీ రోడ్డెక్కేశాయని మాజీ మంత్రి పేర్నినాని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్,ఎంపీ కేశినేని చిన్ని వివాదంపై పేర్నినాని స్పందించారు.
ఈ సందర్భంగా కేశినేని చిన్నికి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ను టీవీలో తప్ప నేనెప్పుడూ చూడలేదు.కేసినేని చిన్ని మునిగిపోతున్న నావ మాదిరి కనిపిస్తున్నాడు. జగ్గయ్యపేట,నందిగామలో ఇసుకను కూడా లాగేసుకున్నారు. దేవాదాయ భూముల్లో ఎగ్జిబిషన్ పెట్టి పీకల్లోతు మునిగిపోయాడు. హైదరాబాద్‌లో చిన్ని పాపాలన్నీ రోడ్డెక్కేశాయి’అని వ్యాఖ్యానించారు.


