సాక్షి,గుంటూరు: పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ ఏ ధర్మాన్ని పాటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
వైఎస్ జగన్‌పై కూటమి నేతలు విషప్రచారం చేస్తున్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ ధర్మాన్ని ఆచరించే వ్యక్తి. వైఎస్సార్‌సీపీ హయాంలో పరాకామణి భవన నిర్మాణం జరిగింది. కూటమి ప్రభుత్వంలో దేవాలయాల్లో భక్తులు చనిపోయారు. దేవాలయాల్లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణిస్తే పవన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. తిరుమల లడ్డూపై పవన్ అసత్య ప్రచారం చేసి టీటీడీ పరువును అప్రతిష్టపాలు చేశారు. చంద్రబాబు అనేక దుర్మార్గాలు చేస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో పవన్ రోజుకో వేషం వేస్తున్నారు. చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నారు.
2003లో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిందెవరు?. విజయవాడలో 40 దేవాలయాల్ని కూల్చిందెవరు? చంద్రబాబు తన ప్రచార పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు తీశారు. చంద్రబాబును ప్రశ్నించే దమ్ము పవన్‌కు లేదు. చంద్రబాబు,పవన్ ఎంత బురద జల్లిన వైఎస్ జగన్‌కు అంటుకోదని స్పష్టం చేశారు.


