సాక్షి, తాడేపల్లి: బోరుగడ్డ అనిల్‌కుమార్ అనే వ్యక్తి తమ పార్టీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని.. అతనితో ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్‌సీపీ స్పష్టత ఇచ్చింది. పలు ఇంటర్వ్యూలలో అనిల్ పలువురు నేతలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగానూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో..
‘‘బోరుగడ్డ అనిల్‌కుమార్‌తో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదు. అతను మా పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ఇటీవల వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. అతని మీద టీవీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఎలాంటి సంబంధం లేదు. బోరుగడ్డతో మాపార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’ అని వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటనలో పేర్కొంది.

గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌పై పలు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో.. పోలీసులు రోడీ షీటర్‌గా గుర్తించారు. ఇంతకు ముందు పలు కేసుల్లో అరెస్ట్ కూడా అయ్యాడు. అయితే.. ఆ సమయంలోనూ తాను వైఎస్సార్సీపీ మనిషినంటూ ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతనికి సంబంధించిన ఇంటర్వ్యూలలోనూ పార్టీ ప్రస్తావన తేవడంతో వైఎస్సార్‌సీపీ ఓ స్పష్టత ఇచ్చింది.


