విజయ్‌ ర్యాలీలో గర్జించిన లేడీ సింగం | Meet IPS Isha Singh who controlled the crowd at Vijay Puducherry rally | Sakshi
Sakshi News home page

విజయ్‌ ర్యాలీలో గర్జించిన లేడీ సింగం

Dec 10 2025 7:12 PM | Updated on Dec 10 2025 8:23 PM

Meet IPS Isha Singh who controlled the crowd at Vijay Puducherry rally

కరూర్‌ విషాదం నేపథ్యంలో.. టీవీకే సభలు, ర్యాలీలకు షరతులు, పరిమితులతో నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా పుదుచ్చేరిలో జరిగిన విజయ్‌ ర్యాలీ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. పరిమిత సంఖ్యలో కార్యకర్తలు(అభిమానుల్ని) అనుమతించడంతో కొందరు బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే లేడీ సింగం గర్జించింది.. 

మంగళవారం ఉదయం ఉప్పలం ఎక్స్‌పో గ్రౌండ్‌ వద్ద విజయ్‌ ర్యాలీ జరుగుతున్న సమయంలో టీవీకే నేత బస్సీ ఆనంద్‌.. బారికేడ్ల వద్దకు వచ్చి ‘‘లోపల స్థలం ఉంది.. రండి..’ అంటూ జనాల్ని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఐపీఎస్‌ అధికారిణి ఇషా సింగ్‌ వెంటనే ఆయన చేతిలో ఉన్న మైక్‌ను లాగిపడేశారు. 40 మంది ప్రాణాలు పోయాయి కదా.. మళ్లీ అలాంటి పరిస్థితులు కావాలనుకుంటున్నారా? అని ఆయన్ని ఆమె నిలదీశారు. ఈ క్రమంలో.. అనుమతించిన సంఖ్యకు మించి ఒక్కరినీ కూడా లోపలికి అనుమతించబోమని కుండబద్ధలు కొట్టారామె. దీంతో.. ఆయన మౌనంగా చూస్తూ ఉండిపోయారు. 

కరూర్ ఘటన తర్వాత పుదుచ్చేరి పోలీసులు కఠిన నియమాలు అమలు చేశారు. రోడ్షోకు అనుమతి లేదు, ప్రజల సంఖ్యను 5,000కి పరిమితం చేశారు. QR కోడ్ పాస్ ఉన్నవారికే ప్రవేశం ఇచ్చారు. అయితే అంత జాగ్రత్తలు పాటించినా కూడా ఓ వ్యక్తి తుపాకీతో రావడం కలకలం రేపింది.

 

ఇషాసింగ్‌(28) 2020లో యూపీఎస్సీ ఆల్‌ ఇండియా 191 ర్యాంకర్‌. 2021 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఇషా సింగ్.. ప్రస్తుతం పుదుచ్చేరి పోలీస్‌ సూపరింటెండెంట్‌. ఆమె తండ్రి మాజీ ఐపీఎస్‌ వైపీ సింగ్‌(ముంబై పోలీస్‌​ కమిషనర్‌గానూ పని చేశారు). తల్లి అభాసింగ్‌ లాయర్‌, సామాజిక కార్యకర్త. ఇషా సింగ్‌ నేషనల్‌ లా స్కూల్‌నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఐపీఎస్‌ కాకముందు.. లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement