సాక్షి, ముంబై: రెస్టారెంట్లు, కేఫ్‌లు, హోటల్ కెళ్లినపుడో విహార యాత్రకెళ్లినపుడో, మనకు సర్వీసు అందించిన ఉద్యోగులకు,టాక్సీ డ్రైవర్లు టూర్ గైడ్‌లకు కొద్దో గొప్పో టిప్ ఇవ్వడం చాలా సాధారణం.,అలా టిప్పుల ద్వారా వచ్చిన సొమ్ముతో ఖరీదైన కారు కొన్నాడు. తన విజయంతో పొదుపు గొప్పతనాన్ని, తాను ఆచరించిన ఆర్థిక క్రమ శిక్షణ విశిష్టత గురించి చెప్పకనే చెప్పాడు.
ఇటాలియన్ క్రూయిజ్ షిప్‌లో బట్లర్‌గా పనిచేస్తున్నాడు మహారాష్ట్రలోని మాథెరన్‌కు చెందిన ప్రవీణ్ జోషిల్కర్. ఇండియాలోని ముంబైకి చెందిన క్రూయిజ్ షిప్ ఉద్యోగి ప్రవీణ్ కేవలం టిప్స్‌తోనే రూ. 10 లక్షల విలువైన కారు కొన్నాడు: "జీతం పొదుపు కోసమే" అంటూ తన ఆర్థిక వ్యూహాన్ని వివరించాడు. అలాగే ఈ టిప్స్ తన జీవన ఖర్చులు కొనుగోళ్లను కవర్ చేస్తాయని చెప్పుకొచ్చాడు.
యూరోపియన్, అమెరికన్ అతిథుల నుండి అందుకున్న నగదు ద్వారానే ఈ కారును కొనుగోలు చేశానని పేర్కొన్నాడు. క్రూయిజ్ షిప్‌లో తన జీవితాన్ని డాక్యుమెంట్ చేసే కంటెంట్ సృష్టికర్తగా కూడా ఉన్నాడు. కొత్త కారుతో పోజులిచ్చిన ఫోటోతో తన విజయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఏంతో ఉదారంగా టిప్స్ ఇచ్చిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపాడు.
క్రూయిజ్ షిప్‌లో పనిచేసేటప్పుడు టిప్స్‌తో ఏదైనా కొనుక్కోవచ్చు. జీతం భవిష్యత్ పొదుపు కోసం బ్రో," అనే క్యాప్షన్‌తో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు అతనికి విషెస్ అందించారు. క్రూయిజ్ పరిశ్రమలో కెరీర్ అవకాశాల గురించి అడిగిన అనేక మంది ఆరా తీయగా, అభినందనలు బ్రో అని చాలామంది వ్యాఖ్యానించారు.
"> జోషిల్కర్ ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ గ్రాడ్యుయేట్. మహారాష్ట్రలోని మాథెరన్‌లో నివసిస్తున్న ప్రవీన్ పగటిపూట, అతను ఇటాలియన్ క్రూయిజ్ కంపెనీలో బట్లర్‌గా పనిచేస్తాడు . రాత్రిపూట, అతను క్రూయిజ్ షిప్‌లో తన అనుభవాలతో కంటెంట్ క్రియేటర్ అవతారమెత్తుతాడు.
ఇదీ చదవండి: Indigo Crisis హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో


