విజయవాడ: ఏపీలో అధికార టీడీపీ నేతలైన ఎంపీ కేశినాని చిన్ని-ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్ తారాస్థాయికి చేరింది. ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్‌గా కొలికపూడి సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ పెడుతూ హిట్ పుట్టిస్తున్నారు. కొలికపూడి పోస్ట్‌లతో ఎంపీ కేశినేని చిన్ని వర్గంలో కలవరం మొదలైంది. తాజాగా కేశినేని చిన్నిపై కొలికపూడి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింంది.
గంపలగూడెం టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫోటోను విడుదల చేశారు కొలికపూడి. గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన మానుకొండ రామకృష్ణ ఫోటోను పెడుతూ ‘ బంగారు కొండ.. మానుకొండ’ అంటూ పోస్ట్ పెట్టారు కొలికపూడి. ఈనెల 18 నుంచి గంపలగూడెం మండలంలో పల్లెనిద్ర అంటూ మరో పోస్టు పెట్టారు. కొలికపూడి వరుస పోస్టులు తిరువూరులో దుమారం రేపుతున్నాయి.



