టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మరో వాట్సప్ స్టేటస్‌.. | Tiruvuru TDP MLA Kolikapudi Srinivasa Rao New Controversy | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మరో వాట్సప్ స్టేటస్‌..

Feb 9 2026 3:25 PM | Updated on Feb 9 2026 4:56 PM

Tiruvuru TDP MLA Kolikapudi Srinivasa Rao New Controversy

సాక్షి,ఎన్టీఆర్‌: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వాట్సప్ స్టేటస్‌లు పెట్టడం మరోసారి టీడీపీకి తలనొప్పిగా మారింది. ఏపీలో ప్రభుత్వ పనితీరు అధ్వాన్నంగా ఉందంటూ పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ కొలికపూడి పెట్టిన వాట్సప్‌ స్టేటస్‌ మరోసారి చర్చాంశనీయంగా మారింది.

ఎమ్మెల్యే కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్‌లో మూడు రోజులపాటు 35 గ్రామాలు, 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపిన విషయాన్ని ప్రస్తావించారు. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుందని పెట్టిన స్టేటస్‌పై స్థానికంగా హాట్‌ టాపిక్‌గా మారింది. 

కొలికపూడి స్టేటస్‌ టీడీపీ పాలనకు అర్ధం పట్టే విధంగా ఉందని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. కొలికపూడి పోస్టుతో టీడీపీ శ్రేణుల్లో విస్తృత చర్చ మొదలైంది. పరోక్షంగా సొంత పార్టీనే ఉద్దేశించి స్టేటస్‌ పెట్టినట్లు గుసగుసలాడుకుంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement