ఎమ్మెల్యే కొలికపూడిపై కృష్ణలంక పీఎస్‌లో ఫిర్యాదు | Complaint filed against MLA Kolikapudi at Krishnalanka Police Station | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కొలికపూడిపై కృష్ణలంక పీఎస్‌లో ఫిర్యాదు

Oct 5 2026 11:27 AM | Updated on Oct 5 2026 11:27 AM

Complaint filed against MLA Kolikapudi at Krishnalanka Police Station

కృష్ణలంక(విజయవాడతూర్పు): తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరు తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ వ్యక్తిగత కార్యదర్శి చెరుకూరి కిరణ్‌ ఆదివారం కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సామాజిక సంక్షేమ బోర్డు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కొలికపూడి తన 100 మంది అనుచరులతో ధర్నా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులకు ఈ ఫిర్యాదు అందజేశారు. 

ఇటీవల తిరువూరుకు చెందిన పీఈటీ టీచర్‌ను ఎమ్మెల్యే తన ఇంటికి పిలిపించి కర్రతో తీవ్రంగా కొట్టారని, హెచ్‌ఎంను నీచ పదజాలంతో దూషించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ పోతుల బాలకోటయ్య తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు లిఖితపూర్వకంగా లేఖ రాసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఈ నేపథ్యంలో మూడు రోజులుగా చైర్మన్‌ బాలకోటయ్యకు ఎమ్మెల్యే అనుచరుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఫిర్యాదులో చెరుకూరి కిరణ్‌ పేర్కొన్నారు.  సామాజిక సంక్షేమ బోర్డు కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement