breaking news
Krishnalanka police station
-
ఈ ప్రశ్నలకు బదులేది..?
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యమై వందరోజులు దాటింది. నా కొడుకు మృతదేహాన్ని ఏం చేశారు... కనీసం ఆ బూడిదైనా ఇవ్వండంటూ సాయికృష్ణ తల్లి నెత్తీ...నోరూ మొత్తుకున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఏదో కన్నీళ్లు తుడవటానికంటూ సిట్ వేసి చేతులు దులుపుకొంది. సిట్ వేసి రెండు నెలలు గడిచినా విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేవలం సీఐ నాగరాజు, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును అరెస్టు చేయడం వరకే పరిమితం అయింది తప్ప కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం కలిగించిన విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యమై వంద రోజులైంది. ఇప్పటికీ సాయికృష్ణ మృతదేహం ఏమైందో, ఎక్కడ దహనం చేశారో, బూడిద కూడా ఏం చేశారో పరమ రహస్యంగానే ఉంది. రిమాండ్‌లో ఉన్న సీఐ నాగరాజుని, నలుగురు కానిస్టేబుళ్లను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని వేర్వేరుగా ప్రశ్నించినా ఇప్పటివరకూ ఏం తేల్చలేకపోయారు. అసలు సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్్క ఫోర్స్ పోలీసులు ఏ కేసులో తీసుకు వచ్చారు. వారెంట్ పెండింగ్ ఉంటే కోర్టులో హాజరుపర్చకుండా, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఎందుకు అప్పగించారు. అక్కడే ఉంచి విచారించారా.. లేక మరేదైనా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారా.. సాయికృష్ణ ఎప్పుడు(లాకప్‌డెత్) మరణించాడు. ఆ తర్వాత డెడ్‌బాడీని ఏం చేశారో ఇప్పటికీ తేల్చలేదు. బైక్‌పై డెడ్‌బాడీని తీసుకెళ్లి స్వర్గపురిలో దహనం చేసినట్లు వస్తున్న వార్తలు నిజమేనా.. స్వర్గపురిలో ఏమి ఆధారాలు సేకరించారన్న సమాచారంపై స్పష్టత రాలేదు. సాయికృష్ణ కాలిగోళ్లు పీకడం కోసం ఉపయోగించిన ఆర్ఎంపీ ఇప్పటివరకూ ఎంతమందికి ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు. అసలు పోలీసు స్టేషన్లో ఆర్ఎంపీకి ఏం పని అనే విషయంపై కూడా సిట్ దృష్టి పెట్టలేదు. సాయికృష్ణ కేసులో కమిషనరేట్‌లోని మరో సీఐ సహకరించారన్న వార్తలపై... ఆ సీఐ ఎవరు అన్నది గుర్తించారా? గుర్తిస్తే ఇప్పటి వరకూ ఆ సీఐని ఎందుకు ప్రశ్నించలేదు అన్నది చర్చనీయాంశంగా మారింది. సమాధానాలు లేని ప్రశ్నలు... సిట్ చేస్తున్న విచారణ తీరును చూస్తే కేవలం సీఐ నాగరాజు, కానిస్టేబుళ్ల అరెస్టులతో సరిపెట్టేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ కేసులో సీఐ స్నేహితుడు సురేష్ హస్తం ఉందని ముందునుంచే వార్తలు వస్తున్నప్పుడు అతను అదృశ్యం అయ్యే వరకూ పోలీసులు ఎందుకు వేచి ఉన్నారు. ఈ కేసులో ఉన్న కానిస్టేబుళ్లు పరారీలో ఉన్న సమయంలో డబ్బుల కోసం తమ ఫోన్లు నాగపూర్‌లో అమ్మేశామని కట్టుకథ చెబితే దాన్ని ఎందుకు ఛేదించలేదు. పోయిన ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి బాధితులకు ఇస్తున్న తరుణంలో పోలీసు కానిస్టేబుళ్లు అమ్మేసిన ఫోన్లు ఎందుకు కనిపెట్టలేకపోయారు. సిట్ ఇప్పటివరకూ ఈ కేసుపై అప్డేట్ ఎందుకు ఇవ్వడం లేదు. అసలు సాయికృష్ణ ఏమయ్యాడో తేల్చేందుకు మరెన్ని రోజులు కావాలి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు ఇప్పటికే బెయిల్ పిటీషన్ కూడా దాఖలు చేశారు. కేసును కాలయాపన చేస్తూ నీరుగార్చి బెయిల్ వచ్చేందుకు సహకరిస్తారా? అసలు ఈ కేసులో ఉన్న పెద్దల్ని ఎందుకు కాపాడుతున్నారు. దీని వెనుక ఏ వ్యవహారం ఉందన్న విషయంపై ఎందుకు విచారణ జరపడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ కేసు నీరుగార్చే ప్రయత్నాలు సాయికృష్ణ తల్లిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిసినప్పటి నుంచి జరుగుతున్నట్లు స్వయంగా సాయికృష్ణ పిన్ని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సాయికృష్ణ తల్లితో హెబియస్ కార్పస్ పిటీషన్ విత్‌డ్రా చేసేందుకు పిటీషన్ కూడా వేయించిన సంగతి తెలిసిందే. పోలీసు స్టేషన్లో సీసీ ఫుటేజ్ మొత్తాన్ని ఒక హోంగార్డు మాయం చేశాడని నెపం అతనిపై వేసేశారు. పోలీస్‌స్టేషన్ సీసీ ఫుటేజ్ సరే.. ఆ స్టేషన్ రోడ్డులోని కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం అయి ఉంటాయి కదా.. అక్కడ ఫుటేజీ ఏమైందన్న విషయాన్ని సిట్ తేలుస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు...ఇంకా సమాధానాలు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యమై వందరోజులు దాటింది. నా కొడుకు మృతదేహాన్ని ఏం చేశారు... కనీసం ఆ బూడిదైనా ఇవ్వండంటూ సాయికృష్ణ తల్లి నెత్తీ...నోరూ మొత్తుకున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఏదో కన్నీళ్లు తుడవటానికంటూ సిట్ వేసి చేతులు దులుపుకొంది. సిట్ వేసి రెండు నెలలు గడిచినా విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేవలం సీఐ నాగరాజు, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును అరెస్టు చేయడం వరకే పరిమితం అయింది తప్ప కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. -
మూడవరోజు CI నాగరాజు కస్టడీ విచారణలో షాకింగ్ నిజాలు
-
సాయి కృష్ణ కేసులో ట్విస్ట్..? తల్లికి తెలియకుండానే పిటిషన్
-
ఇది పక్కా ప్లాన్ మర్డర్... వాళ్లందరికీ ఉరిశిక్ష పడేవరకు పోరాడుతాం
-
కృష్ణలంక CCTV ఫుటేజ్ ఎలా మిస్సయిందంటే..? అడ్వకేట్ షాకింగ్ నిజాలు..
-
సాయికృష్ణ కేసు విచారణలో ఫుల్ రిపోర్ట్ ఇదే..!
-
నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరిన SIT బృందం
-
ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే!
-
రిమాండ్ రిపోర్టులో అసలు నిజాలు.. సీఐ నాగరాజు దొరికిపోయింది ఇలాగే..!
-
నాగరాజు కేసులో సిట్ దూకుడు.. ACM కోర్టులో పిటిషన్
-
కమిషనరేట్ నుంచి కృష్ణలంక పీఎస్ దాకా.. అందరికీ ఈ కేసుతో లింకులు
-
రాజమండ్రి జైలుకు CI నాగరాజు
-
సాయి కృష్ణ కేసులో ట్విస్టులు మీద ట్విస్టులు
-
సాయి కృష్ణ కేసులో మరో సంచలన మలుపు!
సాక్షి, విజయవాడ: సంచలనం రేపిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసు.. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడు.. కృష్ణలంక సీఐ(సస్పెండెడ్) నాగరాజు అధికారులు ఐదు గంటలపాటు ప్రశ్నించినా మౌనం వహించినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టుకు సిట్ ఎలాంటి సమగ్ర దర్యాప్తు నివేదికను సమర్పిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు కాపీ వెలుగులోకి రావడం మరింత కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ “సాయి కృష్ణ ఎక్కడ?” అన్న ప్రశ్న చుట్టూ తిరిగిన వ్యవహారం ఇప్పుడు “సాయి కృష్ణ బతికే లేడు” అనే విషయాన్ని ధృవీకరించే దిశగా వెళ్తోంది. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, అనంతరం ఆధారాలు లేకుండా శవాన్ని తగులబెట్టారని ఆరోపిస్తూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు కాపీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఫిర్యాదులో ఏముంది?ఈ నెల 19వ తేదీన సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడు సాయి కృష్ణను మే నెల మొదటి వారంలో పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) కేసు పేరుతో కృష్ణలంక, మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించారని, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు.దండ రెడీ చేసుకో..విజయలక్ష్మి చేసిన ఫిర్యాదులో సీఐ నాగరాజుపై సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన తర్వాత సీఐ నాగరాజు తనతో “నీ కొడుకుని చంపేస్తాం.. దండ రెడీ చేసుకో” అని చెప్పారని విజయలక్ష్మి ఆరోపించారు. అలాగే లాకప్‌లో సాయి కృష్ణను తీవ్రంగా కొడుతున్న సమయంలో అతడి అరుపులు, కేకలు తాను స్వయంగా విన్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడిని తనతో పంపించాలని కోరగా.. సీఐ నాగరాజు తనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.అందుకే హైకోర్టుకు.. సాయి కృష్ణ ఆచూకీ లభించకపోవడంతో తన కుమార్తె ద్వారా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినట్లు విజయలక్ష్మి తన ఫిర్యాదులో వివరించారు. అయితే అప్పటికే సాయి కృష్ణ మరణించాడని, ఆ విషయం బయటపడితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో అతడి మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా తగులబెట్టారని ఆరోపించారు. తన కొడుకును కిరాతకంగా చంపిన నాగరాజును కఠినంగా శిక్షించాల్సిందేనని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐ నాగరాజుపై అక్రమ నిర్బంధం, ఆధారాలను నాశనం చేయడం, హత్యాయత్నం తదితర అభియోగాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.విచారణలో నాగరాజు ఏమైనా కీలక విషయాలు వెల్లడించాడా? సాయి కృష్ణ ఆచూకీపై స్పష్టత ఇచ్చాడా? ఎవరు చెబితే ఇదంతా చేశాడు?.. సీసీటీవీ పుటేజీ ఎందుకు మాయం చేశాడు?.. అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో నాగరాజుకు రాజకీయ భవిష్యత్తుపై హామీలు ఇచ్చారని, అందుకే విచారణలో పూర్తిగా నోరు విప్పడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
CI నాగరాజు కాలర్ ఎగరేసుకొని...! సాయి కృష్ణ కేసులో కూటమి కుట్ర
-
సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్..! నాగరాజును కాపాడేది వీళ్లే..!
-
CI నాగరాజు అరెస్ట్..
-
CCTV ఫుటేజ్ మాయం చేసింది CI నాగరాజు కాదు అంబటి సంచలన నిజాలు
-
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. శ్మశాన వాటికలో పోలీసుల విచారణ
-
నీ గబ్బర్ సింగ్ సినిమా చూసి..నాగరాజు రెచ్చిపోయినట్టున్నాడు పవన్ ను ఏకిపారేసిన జడ శ్రవణ్
-
ఈ కేసులో న్యాయం జరిగే ప్రసక్తే లేదు..చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్
-
రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు
-
హోటల్లో రెండు రోజులు చిత్రహింసలు పెట్టి CIకి అప్పగించారు..! అంబటి షాకింగ్ కామెంట్స్
-
కృష్ణ లంక పోలీస్ స్టేషన్ కు ఫోరెన్సిక్ టీమ్
-
నారా లోకేష్‌పై కృష్ణలంక పీఎస్‌లో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత నారా లోకేష్‌పై కృష్ణలంక పీఎస్‌లో కేసు నమోదైంది. సెక్షన్ 341,186,269 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, ట్రాఫిక్ అంతరాయం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని లోకేష్‌పై కేసులు నమోదయ్యాయి. గురువారం విమానాశ్రయం ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా లోకేశ్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీ నేతలు గుంపులుగా అక్కడికి చేరుకుని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై, పోలీసులపై దూషణలకు దిగడంతో పాటు 144 సెక్షన్‌ను ఉల్లంఘించారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా లోకేశ్‌పై విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ముందస్తుగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ట్రాఫిక్‌కు అంతరాయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇవీ చదవండి: ఏపీ నూతన సీఎస్‌గా సమీర్ శర్మ ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు -
రుణం పేరుతో నమ్మించి ముంచారు
కృష్ణలంక(విజయవాడ తూర్పు): ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలనుకున్న ఓ యువ రైతుకు వ్యవసాయ రుణం పేరిట వైట్ కాలర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఓ ప్రైవేట్ బ్యాంకు(హెచ్డీఎఫ్సీ) నుంచి రుణం మంజూరు చేయిస్తామంటూ నమ్మబలికి.. లోన్ ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, బీమా ఛార్జీలతోపాటు కమీషన్ల పేరుతో రూ.5 లక్షలు వసూలు చేశారు. అయితే చెప్పిన మేరకు రుణం ఇప్పించకపోగా.. కమీషన్ ఇస్తేనే పని జరుగుతుందంటూ చెప్పడంతో అనుమానించిన రైతు చివరకు డబ్బు, ఆస్తి పత్రాలు తిరిగిచ్చేయాలని అడగ్గా బెదిరింపులకు దిగారు. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన రైతు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కృష్ణలంక బాలాజీనగర్‌కు చెందిన ఎ.సురేష్ కుమార్ అనే యువ రైతు నందిగామ ప్రాంతంలో తనకున్న 40 ఎకరాల భూమితోపాటు కౌలుకు 80 ఎకరాలు భూములు తీసుకుని అత్యాధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అవసరమైన పెట్టుబడికోసం బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకున్నాడు. వ్యవసాయ రుణంకోసం అతను ప్రయత్నిస్తుండగా బ్యాంక్ ప్రతినిధులమంటూ శ్రీనివాస చక్రవర్తి, వి.సుధాకర్, జి.విజయకుమార్, సత్యరెడ్డి, బి.సాయితేజ, రవి అనే వ్యక్తులు గతేడాది డిసెంబర్ 29న సంప్రదించారు. యువ వ్యవసాయదారులను ప్రోత్సహించడానికి తమ బ్యాంకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని, స్పెషల్ లోన్ ప్రోగ్రాంలో భాగంగా అతి తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నామంటూ నమ్మబలికారు. దీంతో రూ.4 కోట్ల వ్యవసాయ రుణానికి సురేష్ దరఖాస్తు చేశాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలు, ఫార్మాలిటీ పేరుతో రూ.5 లక్షలు తీసుకున్న మోసగాళ్లు ఆస్తుల పరిశీలన, హామీదారుల నుంచి సంతకాలు తీసుకోవడం తదితర కార్యక్రమాలతో కొద్దిరోజులు హడావుడి చేశారు. మూడు నెలలు దాటాక.. మీకు కోటి రూపాయల లోన్ మాత్రమే మంజూరయ్యిందని, అంతకంటే ఎక్కువ మొత్తం కావాలంటే 5 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. కోటి రూపాయలే కావాలనుకుంటే తెల్లకాగితంపై సంతకం చేయాలన్నారు. పోలీసులకు ఫిర్యాదు దీంతో అనుమానించిన సురేష్ కుమార్ లోన్ అక్కర్లేదు.. డబ్బులు, ఆస్తి పత్రాలు తిరిగిచ్చేయండని కోరాడు. లోన్ వద్దంటే కట్టిన డబ్బులో ఒక్క రూపాయి తిరిగిరాదని, ఆస్తి పత్రాలు తిరిగివ్వాలంటే రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని వారు బెదిరింపులకు దిగారు. దీంతో తన దరఖాస్తు గురించి తెలుసుకునేందుకు బందరురోడ్డులోని బ్యాంకుకు వెళ్లిన సురేష్ కుమార్‌కు అగ్రికల్చర్ లోన్ విభాగం వాళ్లెవ్వరూ ఇక్కడ లేరని బ్యాంకు సిబ్బంది చెప్పారు. మోసపోయానని గ్రహించిన సురేష్ కుమార్ తనకు న్యాయం చేయాలంటూ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆగ్రహ జ్వాల
సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన ఎస్సీలు కులాన్ని అవమానించారంటూ మండిపాటుమైలవరంలో సీఎం దిష్టిబొమ్మ దహనం,పది మంది అరెస్ట్ బందరులో దళిత సంఘాల ధర్నాజిల్లాలో సీఎంపై నాలుగు ఫిర్యాదులు విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘కుల’ వ్యాఖ్యలపై ఎస్సీలు నిప్పులు చెరిగారు. కులాన్ని అవమానించేలా మాట్లాడటంపై మండిపడ్డారు. అందరినీ సమదృష్టితో చూడాల్సిన ముఖ్యమంత్రే అవమానకరంగా వ్యాఖ్యలు చేయటాన్ని నిరసిస్తూ బందరులో ధర్నా నిర్వహించారు. మైలవరంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. అవనిగడ్డలో ఇద్దరు, తిరువూరులో ఒకరు, విజయవాడ కృష్ణలంకలో మరొకరు సీఎంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీలను అవమానించినందున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాల్సిందిగా వారి ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. జిల్లాలో నాలుగు ఫిర్యాదులు... ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎమ్మార్పీఎస్, ఎస్సీ నాయకులు జిల్లాలో నాలుగుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవనిగడ్డ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు నలకుర్తి రమేషన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మాలమహానాడు నాయకుడు డి.గోవర్థన్, ఎమ్మార్పీఎస్ నాయకుడు కె.రాజేశ్వరరావు కూడా ఫిర్యాదు అందజేశారు. వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మార్పీఎస్ నాయకుడు ఎం.గోపాల్, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో మాదిగ హక్కుల పోరాట సమితి నాయకుడు యు.రోజ్‌కుమార్ చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసులు నమోదు చేయలేదు. పలుచోట్ల నిరసనలు బందరులో దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో దళి సంఘాల వారు సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ముందుగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ధర్నా చేశారు. పోలీసు చర్యలను కూడా ఈ సందర్భంగా వారు ఖండించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని అడ్డంపెట్టుకొని ఎస్సీలను అవమానించిన సీఎంపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తమపై పోలీసులు ప్రతాపం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మైలవరంలో దిష్టిబొమ్మ దహనం మైలవరంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవ్వరూ కోరుకోరంటే ఎస్సీ కులాన్ని ఎంతగా సీఎం కించపరిచారో అర్థమవుతుందని, అంటే ఆ కులంలో ఉన్న వారు పిల్లలను కనకుండా ఆపివేయాలని డెరైక్టుగానే సీఎం చెప్పారని వారు మండిపడ్డారు. ఇటువంటి విపరీత బుద్ధి సీఎంకు ఎందుకు వచ్చిందోనని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆందోళన చేపట్టిన 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నేతల ఖండనలు... పెనమలూరు మండలంలోని కంకిపాడులో కలపాల వజ్రాలు, బాకీబాబు, జగ్గయ్యపేటలో ఎస్సీ నాయకులు, ఉయ్యూరులో ఎస్సీ నాయకులు ఎస్.సురేష్‌బాబు, దాసరి రవి తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు చర్యలను ఖండించారు. ఎక్కడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో వారు మాట్లాడారు. తదుపరి కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు.


