
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు’’ అంటూ కొలికపూడి మండిపడ్డారు.
తిరువూరులో కిషోర్ ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదాం. ఈ నెల 24న అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదాం. తాడోపేడో తేల్చుకుంటా’’ అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగులకు బాబు దగా
