
విజయవాడ: టీడీపీ నేతలు అరాచకం సృష్టించిన కారణంగానే తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా. పడిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. ఎన్నిక జరగకుండా ఉండటానికి టీడీపీ నేతలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదన్నారు. ‘ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హల్‌చల్ చేశారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు. 20 మంది సభ్యులున్న కౌన్సిల్ లో వైఎస్సార్‌సీపీ 17, టీడీపీ 3 గెలిచింది. ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థినే గెలిపించాలనే వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ గూండాలు గుంపులుగా వచ్చారు. మా పై దాడిచేసేందుకు టిడిపి నేతలకు పోలీసులు మద్దతిచ్చారు. మా పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలను పోలీసులే కిడ్నాప్ చేశారు. ఇంతకంటే నీచంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యవహరించదు. స్వచ్ఛంధంగా వైఎస్సార్‌సీపీకే మద్దతిస్తున్నానని చెప్పినా నిర్మలను లాక్కెళ్లారు
ఛైర్మన్ పదవి కోసం చంద్రబాబు దగ్గర్నుంచి టిడిపి ఎమ్మెల్యే వరకూ అందరూ దిగజారిపోయారు. ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. రేపటి ఎన్నిక సజావుగా జరపాలని ఎన్నికల కమిషనర్ ను కోరాం. రేపు మా కౌన్సిలర్లకు భద్రత కల్పించమని కోరాం. రేపు తిరువూరులో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని ఆశిస్తున్నాం’ అని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు.
తిరువూరులో ప్రజాస్వామ్యం ఖూనీ
తిరువూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ‘టీడీపీ బరిలోని నిలిపిన చైర్మన్ అభ్యర్థి కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. పోలీసులు ఖాకీ దుస్తుల బదులు .. పచ్చ దుస్తులు వేసుకున్నారు. మా కౌన్సిలర్ ను లాక్కెళ్లి...ఆమె మెడలోని వైఎస్సార్‌సీపీ కండువాను తీసి చెట్లలో పడేశారు. ఎన్టీఆర్ జిల్లాలో అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని పోలీస్ కమిషనర్ ను ప్రశ్నిస్తున్నాం
తిరువూరులో జరిగిన విషయాలు తెలుసుకుని కమిషనర్ ఆశ్చర్యపోయారు. పోలీసులు టిడిపి తొత్తుల్లా పనిచేయడం బాధాకరం. రక్షణ కల్పించాల్సిన పోలీసులు...ఎంపీ ,ఎమ్మెల్యేకు అమ్ముడుపోయారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైఎస్సార్‌సీపీ అండగా నిలిచిన మా కౌన్సిలర్లను అభినందిస్తున్నాం. రేపు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి’ అని పేర్కొన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్.