ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ
అందానికి అసలైన కొలమానం? రంగు, ఎత్తు, బరువు, ఆకృతి.. ఇవేవీ కావు. ఆత్మవిశ్వాసమే మనిషికి అసలైన అందం. ఈ నిజాన్ని అర్థం చేసుకున్నరోజు ఎవరి వెక్కిరింతలు మనల్ని ఏమీ చేయలేవు. ఆత్మనూన్యతతో కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం ముఖ్యం. మలయాళ మూవీ తలవర ఇదే విషయాన్ని నొక్కి చెప్తోంది.హీరోకి బొల్లి వ్యాధితలవర సినిమాలో హీరో జ్యోతిష్ (అర్జున్ అశోకన్) బొల్లి వ్యాధితో బాధపడుతుంటాడు. అది చూసి స్నేహితులు సహా అందరూ తనను వెక్కిరిస్తుంటారు. అతడు కూడా కెమెరా ముందుకు రావాలంటే జంకుతాడు. అలాంటి అతడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోల కోసం ఓ ఫోటోగ్రాఫర్ దగ్గరకు వెళ్తాడు. అప్పటికే అక్కడ షార్ట్ ఫిలిం షూటింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ సడన్‌గా ఓ వ్యక్తి రావట్లేదని తెలిసి.. ఫోటో కోసం వెయిట్ చేస్తున్న హీరోను అతడి స్థానంలో నటించమని కోరతారు.అవమానాలుఅలా కెమెరా అంటే భయపడే హీరో తొలిసారి షార్ట్ ఫిలింలో నటిస్తాడు. అప్పుడు తనపై తనకు కొంత ధైర్యం వస్తుంది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి అవమానాలు పడతాడు, దెబ్బలు తింటాడు. ఆ సమయంలో ప్రియురాలు (రేవతి శర్మ).. ఎవరో ఏదో అన్నారని గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటావా? టాలెంట్‌ను నమ్ముకుని ముందుకెళ్లమని చెప్తుంది. మరి యాక్టర్ అయ్యాడా? అందుకు అతడి తల్లి ఒప్పుకుందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఎలా ఉంది?మలయాళ సినిమాలు ఆదరాబాదరా లేకుండా, ఎక్కువ హడావుడి చేయకుండా సింపుల్‌గా, నెమ్మదిగా ముందుకెళ్తాయి. ఫస్టాఫ్ అంతా మామూలుగా వెళ్తూ ఉంటుంది. సెకండాఫ్‌లో హీరో మనసులోని బాధ.. కోపంగా, పట్టుదలగా మారుతుంది. క్లైమాక్స్ బాగుంది. చాలామంది ఇప్పటికీ తమలో ఏదో ఒకటి తక్కువగా ఉందని లోలోనే మథనపడుతుంటారు. అలాంటివారి మనసు మార్చే సినిమా ఇది! ఓటీటీలో..ఈ కథను రాసుకుని, దాన్ని తెరపై అందంగా మలిచిన దర్శకుడు అఖిల్ అనిల్‌కుమార్‌ను అభినందించాల్సిందే! ముఖంతోపాటు శరీరమంతా తెల్లమచ్చలుండే వ్యక్తి పాత్రలో జీవించిన అర్జున్ను కూడా మెచ్చుకుని తీరాల్సిందే! తలవర అంటే విధి అని అర్థం. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు.