
హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'స్వయంభు'. పీరియాడికల్ సబ్జెక్ట్‌తో తీస్తున్న చిత్రం కావడంతో చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకొంటోంది. ఇప్పుడు అది చివరి దశకు వచ్చేసినట్లు ఉంది. ఈ క్రమంలోనే నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే త్వరలో టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సమంత ‘శుభం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 'బాహుబలి' తరహా సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నారు. సంయుక్త హీరోయిన్. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో హీరో నిఖిల్‌తో పాటు ఈమె కూడా కత్తి పట్టుకుని కదన రంగంలో ఉన్నట్లు కనిపించింది. మరి మూవీ ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.
'కార్తికేయ 2' మూవీతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. తర్వాత 'స్పై', '18 పేజీస్' చిత్రాలు చేశాడు గానీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇతడి దృష్టంతా 'స్వయంభు' మీదే ఉంది. దీంతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: కమెడియన్ అలీకి చిరంజీవి గిఫ్ట్.. ఈసారి స్పెషల్‌గా..!)
