
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి కమెడియన్ అలీ (Comedian Ali) ఆప్తమిత్రుడు. ప్రతి ఏడాది వేసవికి అలీతో పాటు బ్రహ్మానందానికి ఓ బహుమతి పంపిస్తుంటారు. అవే మామిడి పండ్లు. ఎప్పటిలాగే ఈసారి కూడా తన ఫామ్‌హౌస్‌లో పండిన మామిడి పండ్లను ఈసారి కూడా అలీకి పంపించాడు. అవి చూసి అలీ దంపతులు మురిసిపోయారు.
ఈసారి ప్రత్యేకంగా..
అయితే ఈసారి వాటికి అదనంగా మరిన్ని బహుమతులు వచ్చాయి. అవే ఆవకాయ పచ్చడి, ఉప్మా, పులిహోర, కేసరి, రసం, పొంగల్.. వంటి రెడీ టు మిక్స్ పొడులు. వాటన్నింటిని చూసి అలీ భార్య జుబేదా తెగ సంబరపడిపోయింది. చిరంజీవి అన్న తమకోసం ప్రేమగా పంపారని పేర్కొంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇన్‌స్టంట్ వంట..
అత్త సురేఖ చేసే వంటల్ని అందరికీ వడ్డించాలన్న సంకల్పంతో ఉపాసన.. అత్తమ్మాస్ కిచెన్ పేరిట గతేడాది ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన విషయం తెలిసిందే! ఇక్కడ పచ్చళ్లతో పాటు అప్పటికప్పుడు ఈజీగా వంటలు చేసుకునేలా రెడీ టు మిక్స్ పొడులు కూడా అందుబాటులో ఉన్నాయి. చిరు సినిమాల విషయానికి వస్తే.. ఈయన చివరగా భోళా శంకర్ (2023) సినిమాలో నటించాడు. ఏడాదిగా వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడితో కలిసి ఓ సినిమా (#Mega157) చేస్తున్నాడు.
చదవండి: ప్రాణాలతో చెలగాటమాడే గేమ్.. ఫైనల్ సీజన్ ట్రైలర్ చూశారా?