Samyuktha Reveals Why She Removed Menon From Her Surname - Sakshi
Sakshi News home page

Samyuktha Menon: అమ్మకు విడాకులు.. నాన్న ఇంటిపేరు మాకొద్దు.. అందుకే తీసేశా

Feb 9 2023 2:08 PM | Updated on Feb 9 2023 2:26 PM

Samyuktha Reveals Why She Removed Menon From Her Surname - Sakshi

నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అమ్మ.. నాన్న ఇంటిపేరును కొనసాగించకూడదని కోరుకుంది. తన అభిప్రాయాన్ని నేను

'పాప్‌కార్న్‌' అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సంయుక్త మీనన్‌. తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఆమె సార్‌ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో హీరో ధనుష్‌ సరసన కథానాయికగా నటించనుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన పేరెంట్స్‌ గురించి మాట్లాడింది.

నేను స్కూలులో జాయిన్‌ అయ్యేటప్పుడు ఇంటిపేరు రాయమన్నారు. అప్పటిదాకా మన పేరు పక్కన ఈ తోక ఏంటా? అనుకునేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక నటిగా నాకు బాధ్యత తెలిసివచ్చింది. మీనన్‌ అనే పదం నా పేరు పక్కన ఉండటం సబబు కాదనిపించింది. సమానత్వం, మానవత్వం, ప్రేమ అన్నింటినీ నేను కోరుకున్నప్పుడు ఇంటి పేరు అడ్డొస్తుందనిపించింది. పైగా నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అమ్మ.. నాన్న ఇంటిపేరును కొనసాగించకూడదని కోరుకుంది. తన అభిప్రాయాన్ని నేను గౌరవించాలనుకున్నాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే సంయుక్త మీనన్‌  సాయిధరమ్‌ తేజ్‌ విరూపాక్షలోనూ నటించనుంది.

చదవండి: తమాషాగా ఉందా? రెండో భర్తకు కూడా విడాకులా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement