Kamya Panjabi Slams Netizens For Saying She Taking Divorce From Second Husband - Sakshi
Sakshi News home page

Kamya Panjabi: 'నీ రెండో పెళ్లి కూడా పెటాకులా?'.. నెటిజన్‌ కామెంట్‌పై నటి ఫైర్‌

Feb 9 2023 1:07 PM | Updated on Feb 9 2023 1:33 PM

Kamya Panjabi Slams Netizens For Saying She Taking Divorce From Second Husband - Sakshi

అంటే నువ్వు రెండో భర్తకు కూడా విడాకులిచ్చేస్తున్నావా? విడాకులంటే అంత తమాషాగా ఉందా?' అని కామెంట్‌ చేశాడు. ఇది కామ్యా కంటపడటంతో అగ్గి మీద గుగ్గిలమైంది.

ప్రేమ.. పెళ్లి.. విడాకులు.. సెలబ్రిటీల కెరీర్‌ గురించి కాకుండా పర్సనల్‌ విషయాల్లో ఎక్కువగా వినిపించే పదాలు. ఇండస్ట్రీలో ఈ మూడు చాలా సర్వసాధారణం అయిపోయాయి. నచ్చితే ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి జీవితాన్ని కలిసి కొనసాగించడం, లేదంటే బ్రేకప్‌, విడాకులతో ఎవరిదారి వారి చూసుకోవడం అక్కడ షరామామూలే! కానీ ప్రేక్షకులు మాత్రం వారి గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అదేంటో తెలుసుకోవాలని తెగ ఆతృత కనబరుస్తుంటారు. నచ్చితే పొగడ్తలు, నచ్చకపోతే విమర్శలు గుప్పించి తారలను ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా బుల్లితెర నటి కామ్యా పంజాబీ విషయంలో అదే జరిగింది.

కామ్యా తాజాగా ట్విటర్‌లో 'చరిత్ర పునరావృతమవుతుంది' అని రాసుకొచ్చింది. దీనికి ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. 'అంటే నువ్వు రెండో భర్తకు కూడా విడాకులిచ్చేస్తున్నావా? విడాకులంటే అంత తమాషాగా ఉందా?' అని కామెంట్‌ చేశాడు. ఇది నటి కంటపడటంతో అగ్గి మీద గుగ్గిలమైంది. 'మీలాంటివాళ్లకు ఏం చెప్పాలి? నీ చెత్త వాగుడు ఇంకెక్కడైనా వాగు. అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నానో కూడా మీకు తెలీదు. కానీ నోటికొచ్చినట్లు వాగుతున్నారు. ముందు నీ తల్లి దగ్గరకు వెళ్లి మర్యాదగా ఎలా మాట్లాడాలో నేర్చుకో.. పో' అని ఫైర్‌ అయింది. కాగా కామ్యా పంజాబీ 2003లో వ్యాపారవేత్త బంటీ నెగిని పెళ్లి చేసుకోగా 2013లో అతడికి విడాకులిచ్చింది. కొన్నేళ్లపాటు ఒంటరిగానే ఉన్న నటి 2020లో ఢిల్లీకి చెందిన హెల్త్‌ కేర్‌ ప్రొఫెషనల్‌ శలభ్‌ డాంగ్‌ను పెళ్లాడింది.

చదవండి: ఆ విషయం బయటపెడితే నన్ను చంపుతానని బెదిరించాడు: నటి
థియేటర్‌ కూర్చున్నా.. ప్యాంటులో ఎలుక దూరింది: బిగ్‌బీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement