
ప్రముఖ బిగ్బాస్ బ్యూటీ, బుల్లితెర నటి సంభావన సేత్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. సీరియల్స్తో పాటు కొన్ని సినిమాల్లో కూడా కనిపించింది. 2016లో అవినాశ్ ద్వివేదిని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. గతేడాది ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చగా.. ఆ తర్వాత జరిగిన షాకింగ్ ఘటనను వివరించింది.
గతేడాది డిసెంబర్‌లో జరిగిన తనకు గర్భస్రావమైందని సంభావన సేత్ వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో అంతా బాగానే ఉందని వైద్యుడు మాకు హామీ ఇస్తూనే ఉన్నాడని తెలిపింది. కానీ ఆ తర్వాత గర్భంలో తన బిడ్డ హృదయ స్పందన 15 రోజుల ముందే ఆగిపోయిందని తాను గుర్తించానని వెల్లడించింది. మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాలని ప్రీ-మెటర్నిటీ షూట్ కూడా నిర్వహించామని సంభావన పేర్కొంది. ఈ సంతోషకర విషయాన్ని చెప్పేందుకు ఒక రోజు ముందే తనకు బ్లీడింగ్ మొదలైందని షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది.
అయితే దాదాపు 15 రోజుల ముందే అనారోగ్యంతో ఉన్నానని వైద్యుడికి సమాచారం ఇచ్చా.. కానీ నాకు ఆర్థరైటిస్ సమస్య అని తేలిగ్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్థరైటిస్ స్పెషలిస్ట్ వద్దకు వెళ్లగా అలాంటిదేం లేదని చెప్పారు.. ఇది గర్భస్రావానికి సంకేతమని డాక్టర్ అన్నారు. కానీ మేము సంప్రదించిన డాక్టర్ మాత్రం ఎలాంటి టెస్టులు చేయకుండా అంతా నార్మల్గానే ఉందని చెప్పారని గుర్తు చేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తనకు గర్భస్రావం అయిందని తెలుసొచ్చిందని సంభావన వివరించింది. అంతేకాకుండా మీకు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ తనదే తప్పు అన్నట్లుగా మాట్లాడిందని తన బాధను వ్యక్తం చేసింది