బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తోన్న కేంద్ర మాజీ మంత్రి.. మరోసారి ‍అలరించనుందా? | Smriti Irani signs contract for Kyunki Saas Bhi Kabhi Bahu Thi sequel | Sakshi
Sakshi News home page

Smriti Irani: బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తోన్న స్మృతి ఇరానీ.. మరోసారి ‍అలరించనుందా?

Jun 10 2025 9:29 PM | Updated on Jun 10 2025 9:31 PM

Smriti Irani signs contract for Kyunki Saas Bhi Kabhi Bahu Thi sequel

సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారు చాలామందే ఉన్నారు. అలా వచ్చినవారు చాలామంది పొలిటికల్‌గా సక్సెస్ కూడా అయ్యారు. అలాంటి వారిలో ఆమె పేరు కచ్చితంగా ఉంటుంది. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా? బుల్లితెరపై తన అందంతో ‍అలరించిన మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. బుల్లితెర నటిగా కెరీర్ ‍ప్రారంభించిన ఆమె.. భాజపాలో కీలకనేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా సేవలదించారు.

బుల్లితెరపై రీ ఎంట్రీ?

అయితే గతంలో బాలీవుడ్‌లో ఆమె నటించిన సూపర్ హిట్ సీరియల్‌ 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి'. ఈ సీరియల్‌కు మేకర్స్ సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ కోసం నటి స్మృతి ఇరానీ ఇప్పటికే ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం. దాదాపు 150 ఎపిసోడ్‌లు ఉన్న ఈ షోలో ఆమె మరోసారి తులసి విరానీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా నివేదిక ప్రకారం స్మృతి ఇరానీ జూన్ 8న 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి 2' కోసం ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిసింది. రెండో వారం ప్రారంభంలోనే ఏక్తా కపూర్‌కో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం.

కాగా.. ఇటీవల స్మృతి కపూర్ ఈ సీరియల్‌లో మిహిర్ విరానీ (మొదటి సీజన్‌) పాత్ర పోషించిన అమర్ ఉపాధ్యాయ్‌తో పాటు ఏక్తా కపూర్  పుట్టినరోజు వేడుకలో కనిపించారు. కరిష్మా తన్నా, అనితా హసానందనీ కూడా పార్టీకి హాజరయ్యారు. 'క్యుంకి సాస్ భీ కభీ బహు థి' అనే సీరియల్‌ హిందీ బుల్లితెర చరిత్రలో అత్యంత ఆదరణ దక్కించుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది. ఈ  సీరియల్‌లో నటించిన వారి కెరీర్‌ కూడా మలుపు తిరిగింది. గతంలో ఈ షో 2000 నుంచి 2008 వరకు ప్రసారమైంది. ఆ తర్వాత స్మృతి ఇరానీకి ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ నటిగా వరుసగా ఐదు అవార్డులను గెలుచుకుంది. అంతే కాకుండా రెండు భారతీయ టెలీ అవార్డులు కూడా దక్కించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement