మార్చి 16న ‘కిర్రాక్ పార్టీ’

Nikhil Kirrak Party Release Date - Sakshi

నిఖిల్ హీరోగా తెరెకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ కిర్రాక్ పార్టీ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 16 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు  శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. నిఖిల్ స్టైలిష్ మ్యాచో లుక్స్ చిత్రంపై అంచనాలను మరింత పెంచేసాయి.

కన్నడ సినిమా కిరిక్‌ పార్టీకి రీమేక్‌ గా తెరకెక్కుతున్న ఈసినిమా నిఖిల్‌కు మరో హిట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కిర్రాక్ పార్టీ సినిమాతో శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిఖిల్ తో ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకులు సుధీర్ వర్మ, చందూ మొండేటి ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు.

సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జ నిఖిల్ సరసన హీరోయిన్ లు గా నటిస్తుండగా రామబ్రహ్మం సుంకర, కిషోర్ గరికిపాటి, అజయ్ సుంకర, అభిషేక్ అగ్రవాల్ నిర్మాతలుగా ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏటివి బ్యానర్ ల పై నిర్మిస్తున్న కిర్రాక్ పార్టీ మార్చ్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదల కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top