మహేశ్ బాబు- రాజమౌళి వారణాసి.. రిలీజ్ డేట్ ఫిక్స్ | Mahesh Babu and rajamouli movie Varanasi release date Locked | Sakshi
Sakshi News home page

Varanasi release date: మహేశ్ బాబు- రాజమౌళి వారణాసి.. రిలీజ్ డేట్ ఫిక్స్

Jan 30 2026 4:11 PM | Updated on Jan 30 2026 4:36 PM

Mahesh Babu and rajamouli movie Varanasi release date Locked

మహేశ్-రాజమౌళి కాంబోలో వస్తోన్న ‍మోస్ట్ అవైటేడ్ అడ్వెంచరస్ సినిమా వారణాసి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో మెప్పించనున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాజమౌళి ట్వీట్‌ చేశారు. 

కాగా.. ఈ చిత్రాన్ని దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు -రాజమౌళి కాంబోలో తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్‌ కూడా పూర్తయింది. ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు.  ఈ మూవీ టైటిల్ రివీల్ చేసేందుకు గ్లోబ్ ట్రాటర్‌ పేరుతో బిగ్ ఈవెంట్ నిర్వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement