పవర్‌ఫుల్‌ పోలీస్‌ | Samyuktha plays powerful police officer in The Black Gold | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ పోలీస్‌

Apr 28 2026 12:02 AM | Updated on Apr 28 2026 12:02 AM

Samyuktha plays powerful police officer in The Black Gold

హీరోయిన్‌ సంయుక్త ప్రధాన పాత్రలో కోల్‌ సిండికేట్‌ నేపథ్యం, నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో రూపుదిద్దుకున్న యాక్షన్‌ సినిమా ‘ది బ్లాక్‌ గోల్డ్‌’. కేఎమ్‌సీ యోగేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు రమేశ్, మురళీ శర్మ, నాజర్, మనీష్‌ వాధ్వా, రాంకీ, రవీంద్ర విజయ్‌ ఇతర పాత్రల్లో నటించారు. మాగంటి పిక్చర్స్‌ సహకారంతో హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండా నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

‘‘తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంతో సాగే కథే ‘ది బ్లాక్‌ గోల్డ్‌’. సంయుక్త పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించారు. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌ నగర్,  ఆదిలాబాద్‌ లొకేషన్స్‌తో పాటుగా, హైదరాబాద్‌లో వేసిన సెట్స్‌లో ఈ సినిమా చిత్రీకరించాం. ఈ మూవీ కోసం పదికిపైగా భారీ సెట్స్‌ వేశాం. 60కిపైగా వర్కింగ్‌ డేస్‌లో చిత్రీకరణను పూర్తి చేశాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సహ నిర్మాత: సింధు మాగంటి, సంగీతం: సామ్‌ సీఎస్‌.

Advertisement
 
Advertisement
Advertisement