మాదాపూర్‌ శ్రీ చైతన్య కాలేజ్‌లో దారుణం | Student Hangs Her Self in Sri Chaitanya College Hostel | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌ శ్రీ చైతన్య కాలేజ్‌లో దారుణం

Oct 12 2017 10:47 AM | Updated on Nov 6 2018 8:08 PM

Student Hangs Her Self in Sri Chaitanya College Hostel - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మాదాపూర్‌లో శ్రీ చైతన్య కాలేజ్‌ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న తోట సంయుక్త(17) బుధవారం అర్థరాత్రి కాలేజ్‌ హాస్టల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంయుక్త స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని రణంపల్లె గ్రామం. సంయుక్త తండ్రి రాజేందర్‌ ఆర్టీసీలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు.

నీట్‌ మెడికల్‌ లాంగ్ టర్మ్‌ కోర్సు తీసుకునేందుకు సంయుక్త మాదాపూర్‌ శ్రీ చైతన్య కళాశాలలో చేరినట్లు తెలుస్తోంది. సరిగా చదవలేకపోతున్నాననే బాధతోనే సంయుక్త ఈ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకున్న సంయుక్తను కాలేజి యాజమాన్యం ఆసుపత్రి తరలించగా.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement