'‍పెద్ది' ఐటమ్ కోసం ఊహించని హీరోయిన్? | Samyuktha Consider For Peddi Movie Special Song | Sakshi
Sakshi News home page

Peddi Movie: మృణాల్, మానస.. ఇప్పుడు హిట్ హీరోయిన్?

Apr 19 2026 6:10 PM | Updated on Apr 19 2026 6:37 PM

Samyuktha Consider For Peddi Movie Special Song

రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు మామూలు కష్టాలు లేవు. మార్చి, ఏప్రిల్‌లో రిలీజ్ అనుకుంటే రెండుసార్లు వాయిదా పడింది. జూన్‌లో కచ్చితంగా వస్తుందని నిర్మాత ప్రకటించారు కానీ తేదీ ఎప్పుడు అనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు 'పెద్ది'తో కాలు కదిపేందుకు ఐటమ్ సాంగ్ హీరోయిన్ దొరకట్లేదు. మృణాల్, మానస అని పలువురు బ్యూటీస్ పేర్లు గతంలో వినిపించగా ఇప్పుడు ఊహించని భామ పేరు తెరపైకి వచ్చింది.

(ఇదీ చదవండి: 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)

మలయాళ భామ సంయుక్తని ప్రస్తుతం 'పెద్ది' ఐటమ్ కోసం పరిశీలిస్తున్నారట. ఈమె అయినా ఫిక్సవుతుందా లేదా అనేది పక్కనబెడితే సంయుక్త పేరు మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. కెరీర్ ప్రారంభం నుంచి పెద్దగా గ్లామర్ చూపించని ఈమె.. గత చిత్రం 'అఖండ 2'లో జాజికాయ అంటూ సాగే పాటలో మాత్రం అందాలన్ని ఆరబోసింది. అటు డ్యాన్స్, ఇటు అందంతో ఆకట్టుకుంది. బహుశా ఆ సాంగ్ చూసి 'పెద్ది' కోసం అడిగారేమో అనిపిస్తుంది.

సంయుక్త హీరోయిన్‌గా చేసిన 'స్వయంభు'.. పాన్ ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు 'బ్లాక్ గోల్డ్' అనే లేడీ ఓరియెంటెడ్ తెలుగు మూవీ చేస్తోంది. విజయ్ సేతుపతితో చేసిన 'స్లమ్ డాగ్' కూడా రిలీజ్ కావాల్సి ఉంది. హిందీ, తమిళ, మలయాళంలో తలో చిత్రం చేస్తోంది.

భీమ్లా నాయక్, బింబిసార, సర్, విరూపాక్ష, నారీ నారీ నడుమ మురారీ తదితర చిత్రాలతో సక్సెస్‌లు అందుకున్న సంయుక్త.. 'పెద్ది'లో ఐటమ్ సాంగ్ చేస్తే మాత్రం కచ్చితంగా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అవుతుంది.

(ఇదీ చదవండి: లెజెండరీ డైరెక్టర్ ఇలా అయిపోయారేంటి? వైరల్ వీడియో)

Advertisement
 
Advertisement
Advertisement