'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయిందా? | Peddi Movie New Release Date | Sakshi
Sakshi News home page

Peddi Release Date: చరణ్.. మరో పాన్ ఇండియా సినిమాతో పోటీ?

Apr 18 2026 9:16 PM | Updated on Apr 19 2026 11:15 AM

Peddi Movie New Release Date

రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి కష్టాలు మామూలుగా లేవు. తొలుత మార్చిలో రిలీజ్ అన్నారు. పని ఇంకా పూర్తవ్వకపోయేసరికి ఏప్రిల్ చివరలో కచ్చితంగా విడుదల చేస్తాం అని మాటిచ్చారు. తీరా ఈసారి కూడా మాట తప్పి జూన్‌లో థియేటర్లలోకి వస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈసారి తేదీ వెల్లడించనప్పటికీ బయట రూమర్స్ మాత్రం వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)

ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రకారం.. 'పెద్ది' మూవీని జూన్ 4న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఈ తేదీ దాదాపుగా ఖరారు అయినప్పటికీ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత దీనిని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ డేట్‌కి వస్తామని ఇప్పటికే యష్ 'టాక్సిక్' సినిమా ఖర్చీఫ్ వేసుకుంది. మరి 'పెద్ది' కూడా అదే తేదీకి వస్తే రెండు పాన్ ఇండియా చిత్రాల మధ్య పోటీ నెలకొంటుంది. అప్పుడు ఇద్దరిలో పైచేయి ఎవరిది అవుతుందో చూడాలి?

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న 'పెద్ది'లో చరణ్.. క్రికెట్, కుస్తీ క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకుడు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడేసరికి చాలామంది దీనిపై మెల్లగా ఆసక్తి తగ్గుతోంది. ఒకవేళ మూడోసారి కూడా వాయిదా పడితే గనుక మరింత డ్యామేజీ కావడం గ్యారంటీ. మరి టీమ్ ఈసారి ఏం చేస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'దేవర 2' కంటే ముందు కొరటాల నుంచి మరో హిట్ సినిమా సీక్వెల్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement