శర్వానంద్ నటించిన 'నారీ నారీ నడుమ మురారి' మూవీ నుంచి తాజాగా మెలోడీ సాంగ్ వీడియో వర్షన్ విడుదల చేశారు. అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఇందులో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలుగా నటించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా మంచి లాభాలు తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి 'దర్శనమే..' అంటూ సాగే వీడియో వర్షన్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. యాజిన్ నిజార్ ఆలపించారు.


