టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కి చాలా గ్యాప్ తర్వాత ‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్‌పడింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైన ఈ చిత్ర..తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. పండక్కి ఎక్కువ సినిమాలు ఉండడంతో తొలి రోజు చాలా తక్కువ థియేటర్స్‌లో సినిమా రిలీజ్ అయింది. అయితే తొలి రోజే హిట్ టాక్ రావడంతో థియేటర్స్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి.
చాలా రోజుల తర్వాత తన సినిమాకు హిట్ టాక్ రావడం ఆనందంగా ఉందంటున్నాడు శర్వానంద్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తన పాత చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్ని సినిమాలు ఇప్పుడు చూసుకుంటే.. తనకే ఆసహ్యం కలుగుతుందని చెప్పారు.
‘జాను(2019) సినిమా సమయంలో నాకు మేజర్ యాక్సిడెంట్ జరిగింది. నా చేయి కూడా పని చేయదని చెప్పారు. కానీ దేవుడి దయ, సంకల్ప బలంలో త్వరగానే రికవరీ అయ్యాను. అయితే ఆ సమయంలో నేను చాలా లావు అయిపోయాను. ‘శ్రీకారం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాల్లో చాలా లావుగా కనిపిస్తాను. కొన్నాళ్ల తర్వాత ఆ సినిమాలు చూస్తే.. ‘ఛీ ఛీ..ఎలా ఉన్నా? నన్ను చూసి టికెట్స్ ఎందుకు తెగాలి?’ అనిపించింది.
అందుకే సినిమాల ఫెయిల్యూర్‌కి నేను కూడా ఒక కారణం అని భావించా. నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. ముందుగా నా శరీరాన్ని మునుపటి మాదిరిగా మార్చాలనుకున్నా. ముందుగా వాకింగ్ ప్రారంభించాను. ఆ తర్వాత రన్నింగ్, యోగా చేస్తూ డైటింగ్ చేశా.ఇప్పుడు నా లుక్ మారింది. నారీ నారీ నడుమ మురారి చిత్రంలో స్టైలీష్‌గా ఉన్నానని చెబుతున్నారు. బైకర్‌లో కూడా అలానే కనిపిస్తా.ఇకపై అన్ని మంచి సినిమాలు అందించడానికే కృషి చేస్తా’ అని శర్వా చెప్పుకొచ్చాడు.


