
తెలుగు సినీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ పత్రిక 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' తన తాజా ఎడిషన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండను ప్రచురించింది. "విజయ్ దేవరకొండ: ది మ్యాన్ ఆన్ ఎ మిషన్" అనే ఆకర్షణీయ టైటిల్‌తో విడుదలైన ఈ మ్యాగజైన్ దృష్టిని సొంతం చేసుకుంటోంది. "ఆత్మవిశ్వాసం, ఆకర్షణతో నిండిన విజయ్ దేవరకొండను మేము క్యాప్చర్ చేశాం. తన రాబోయే చిత్రం 'కింగ్డమ్'తో విజయ్ ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు" అని 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' తమ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన పాన్-ఇండియా చిత్రం "కింగ్డమ్"తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రతిభావంతుడైన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. "కింగ్‌డమ్" జూలై 4, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, గిరీష్ గంగాధరన్ మరియు జోమన్ టీ. జాన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌తో ఈ చిత్రం సాంకేతికంగా కూడా ఉన్నతంగా రూపొందుతోంది. 'కింగ్‌డమ్' విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.