
చాలామంది హీరోయిన్లు అందంగా కనిపిస్తుంటారు. కానీ వాళ్లు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? గ్లామర్ మెంటైన్ చేసేందుకు ఎలాంటి టిప్స్ పాటిస్తుంటారు అనేది చాలామందికి ఉండే సందేహం. కొన్నిసార్లు ఆ హీరోయిన్లే తాము పాటించే హెల్త్ టిప్స్ అని చెప్పి కొన్ని విషయాలు బయటపెడుతుంటారు. అవి వింటున్నప్పుడు.. ఇదేంటి ఈమె ఇలా చెబుతుంది అని కచ్చితంగా అనిపిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఇలాంటిదే ఒకటి చెప్పి అవాక్కయ్యేలా చేస్తోంది.
రీసెంట్‌గా ఓ వెబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి తమన్నా మాట్లాడింది. ఓ సందర్భంలో సదరు యాంకర్..'మొటిమలు తగ్గించుకోవడానికి మీరేం చేస్తారు?' అని అడిగాడు. దీనికి సమాధానమిచ్చిన తమన్నా.. 'ఉదయం లేవగానే బ్రష్ చేయకముందే నా నోటిలో ఉండే లాలాజలం(ఉమ్మి).. మొటిమలపై రాసుకుంటాను. అవి తగ్గిపోతాయి. ఇది నాకు వ్యక్తిగతంగా బాగానే వర్కౌట్ అయింది. దీని వెనక సైన్స్ ఉందని నమ్ముతున్నాను. ఎందుకంటే ఉదయం నిద్రలేవగానే వచ్చే సలైవాలో(ఉమ్మి)లో యాంటి-బాక్టీరియా ఉంటుంది' అని చెప్పింది.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన 'జురాసిక్' సినిమా)
తమన్నా చెప్పింది విని పలువురు నెటిజన్ల మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే ఇప్పటివరకు పింపుల్స్(మొటిమలు) తగ్గించుకునేందుకు రకరకాల క్రీములు ఉపయోగించాలని తెలుసు కానీ ఇలా ఉమ్మి రాసుకోవడం ఏంట్రా బాబు అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇదే చిట్కా చెప్పడం తమన్నాకు కొత్తేం కాదు. గతంలో అంటే 2021లో ఓసారి ఇలానే ముఖానికి తన సలైవా రాసుకుంటానని కూడా చెప్పింది. ఇప్పుడు మరోసారి తన బ్యూటీ సీక్రెట్ బయటపెట్టింది.
అయితే తమన్నాకు వర్కౌట్ అయినట్లు అందరికీ ఈ చిట్కా వర్కౌట్ కావాలని రూల్ ఏం లేదు. ఈ విషయాన్ని ఖండిస్తూ 2024 డిసెంబర్‌లో ఎయిమ్స్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ గార్గి తనేజా ఒక వీడియో పోస్ట్ చేశారు. లాలాజలం రాస్తే మొటిమలు తగ్గుతాయని, చర్మం నిగనిగలాడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది రూమర్ మాత్రమే. ఇలా చేయడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని అన్నారు. మన నోటిలో శుభ్రత సరిగ్గా లేకపోవడం వల్ల లాలాజలం క్షారానికి బదులుగా ఆమ్లంగానూ ఉండొచ్చు. పరిశుభ్రత లోపం కారణంగా నోటిలో చాలా బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ ఆమ్ల లాలాజలాన్ని మొటిమలపై రాసినప్పుడు నష్టాలు జరగొచ్చని అంటున్నారు.
(ఇదీ చదవండి: బాహుబలి సీన్‌పై వివాదాస్పద కథనం... స్పందించిన తమన్నా!)