
హాలీవుడ్‌లో డైనోసార్లు ఉండే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరీ ముఖ్యంగా జురాసిక్ పార్క్ పేరుతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. ఆ జానర్‌లో తీసిన ఓ చిత్రం రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చింది. ఓకే పర్లేదు అనిపించుకునే టాక్ తెచ్చుకుంది. మన దేశంలోనూ ప్రేక్షకులు మూవీని చూశారు. ఇప్పుడు ఈ చిత్రం సరిగ్గా నెల రోజులు అయ్యేసరికి ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.
జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'జురాసిక్ వరల్డ్ రీ బర్త్'. స్కార్లెట్ జాన్సన్ లీడ్ రోల్ చేయగా, గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. 2022లో వచ్చిన 'జురాసిక్ వరల్డ్: డొమినియన్'కు సీక్వెల్‌గా తీసిన చిత్రం ఇది. అయితే అది ఆకట్టుకోలేకపోయింది. ఇది కూడా పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేకపోయింది. దీంతో నెలరోజులు తిరగకుండానే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీల్లో వీడియో ఆన్ డిమాండ్(అద్దె విధానంలో) అందుబాటులోకి తీసుకొచ్చారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు)
'జురాసిక్ వరల్డ్ రీబర్త్' విషయానికొస్తే.. గుండె జబ్బులు సహా మనిషి ఎదుర్కొంటున్న ఎన్నో వ్యాధులు నయమయ్యేలా చేసే శక్తి.. మూడు అరుదైన డైనోసార్ల రక్తంతో చేసిన ఔషదానికి ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. కానీ బతికున్న వాటి నుంచి ఆ రక్తాన్ని సేకరిస్తేనే అది ప్రయోగానికి ఉపయోగపడుతుంది. దీంతో అడ్వెంచర్ ఆపరేషన్స్ చేసే జోరా బెన్నెట్‌తో (స్కార్లెట్ జాన్సన్) మార్టిన్ (రూపర్ట్ ఫ్రెండ్) అనే ఫార్మాస్యూటికల్స్ ప్రతినిధి ఒప్పందం చేసుకుంటాడు.
ఈక్వెడార్‌లో మాత్రమే సంచరించే అరుదైన, డేంజరెస్ డైనోసార్లని గుర్తించి, వాటి రక్తాన్ని సేకరించేందుకు డాక్టర్ హెన్రీ (జొనాథన్ బెయిలీ), బోటు యజమాని, సాహసీకుడు డంకన్ (మహర్షలా అలీ) అందరూ కలిసి ప్రయాణిస్తారు. తర్వాత ఏమైంది? డైనోసార్ల నుంచి రక్తం సేకరించారా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహ' ఓటీటీ బిగ్ డీల్)