
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో బకాసుర రెస్టారెంట్, రాజుగాని సవాల్, భళారే సిత్రం లాంటి తెలుగు సినిమాలతో పాటు కన్నడలో రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'సు ఫ్రమ్ సూ' చిత్రాన్ని ఈ వీకెండే రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ 20కి పైగా కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఈసారి తెలుగువి చాలానే ఉన్నాయండోయ్.
(ఇదీ చదవండి: ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ సినిమా)
ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఓహో ఎంథన్ బేబీ, పరందు పో, మామన్, నడికర్ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు అరేబియా కడలి, మోతెవరి లవ్ స్టోరీ తదితర తెలుగు వెబ్ సిరీసులు ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. వీటితో పాటు ఈ వీకెండ్‌లో 'జూనియర్' కూడా రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 04 నుంచి 10వ తేదీ వరకు)
అమెజాన్ ప్రైమ్
అరేబియా కడలి (తెలుగు సిరీస్) - ఆగస్టు 08
నెట్‌ఫ్లిక్స్
ఎస్ఈసీ ఫుట్‌బాల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05
టైటాన్స్: ద రైజ్ ఆఫ్ హాలీవుడ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05
వెన్స్ డే సీజన్ 2 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06
ఓ ఎంథన్ బేబీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 08
స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ద సెంచరీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 08
మ్యారీ మీ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 10
హాట్‌స్టార్
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫుడీ (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 04
పరందు పో (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 05
లవ్ హర్ట్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07
మిక్కీ 17 (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 07
సలకార్ (హిందీ సిరీస్) - ఆగస్టు 08
జీ5
మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు సిరీస్) - ఆగస్టు 08
మామన్ (తమిళ మూవీ) - ఆగస్టు 08
జరన్ (మరాఠీ సినిమా) - ఆగస్టు 08
సోనీ లివ్
మయసభ (తెలుగు సిరీస్) - ఆగస్టు 07
సన్ నెక్స్ట్
హెబ్బులి కట్ (కన్నడ సినిమా) - ఆగస్టు 08
ఆపిల్ ప్లస్ టీవీ
ప్లాటోనిక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06
ఎమ్ఎక్స్ ప్లేయర్
బిండియే కే బాహుబలి (హిందీ సిరీస్) - ఆగస్టు 08
సైనా ప్లే
నడికర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 08
లయన్స్ గేట్ ప్లే
ప్రెట్టీ థింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 08
బ్లాక్ మాఫియా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)