మరింత క్షీణించిన ఫిష్‌ వెంకట్‌ ఆరోగ్యం.. కన్నీటి పర్యంతమవుతోన్న భార్య! | Tollywood Actor Fish Venkat Health In Critical Condition | Sakshi
Sakshi News home page

Fish Venkat: వెంటిలేటర్‌పై ఫిష్‌ వెంకట్‌.. సాయం కోసం వేడుకుంటోన్న భార్య!

Jul 1 2025 8:08 PM | Updated on Jul 1 2025 8:58 PM

Tollywood Actor Fish Venkat Health In Critical Condition

ఈ రోజుల్లో ఎప్పుడు.. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. విధి రాతకు ఇక్కడ ఎవరు అతీతులం కాదేమో. ఎవరి జీవితంలో ఎప్పుడెలా తలకిందులవుతుందో ఊహించలేం. అలాంటి పరిస్థితి రాకూడదని మనం అనుకుంటాం. కానీ ప్రస్తుతం మనందరిని వెండితెరపై నవ్వించినా ఫిష్‌ వెంకట్‌ పరిస్థితి చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకతప్పదు. గతంలోనే కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినా కూడా ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.

గత కొద్ది నెలలుగా బాగానే ఉన్నా ఫిష్ వెంకట్‌ మరోసారి ఓ ప్రవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. కిడ్నీల ఫెయిల్యూర్‌తో తొమ్మిది నెలల క్రితమే డయాలసిస్‌ చికిత్స తీసుకున్న ఆయన.. మళ్లీ ఆరోగ్యం క్షీణించి ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. ఎవరినీ గుర్తు పట్టేలేనంతగా ఫిష్ వెంకట్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫిష్ వెంకట్‌ ఫ్యామిలీ.. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా దాతలు తమకు అండగా నిలవాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. మళ్లీ ఆయన ఆరోగ్యం మొదటికి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఫిష్‌ వెంకట్‌కు డయాలసిస్‌ చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో డయాలసిస్‌తో పాటు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కూడా అవసరమని వైద్యులు అంటున్నారు. గతంలో చికిత్సకు డబ్బుల్లేక గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న సంగతి తెలిసిందే. 

తెలుగు సినిమాల్లో విలన్ అంటే కొందరు గుర్తొస్తారు.. అలాంటి వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో బోలెడన్ని మూవీస్ చేశారు. ఎన్టీఆర్ 'ఆది' మూవీలో తొడకొట్టు చిన్నా అనే డైలాగ్‌తో తెగ పాపులర్ అయ్యారు. టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ చేసిన ఈ నటుడు.. ప్రస్తుతం ఫిష్ వెంకట్ దయనీయ స్థితిలో ఉన్నాడు. దాతలు ఎవరైనా సరే సాయం చేస్తే కోలుకునే అవకాశముందని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కాగా..  నాలుగేళ్ల క్రితమే ఆయనకు బీపీ, షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో ఆపరేషన్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement