
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని, దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ ఆయన సతీమణి సువర్ణతో పాటు కుమార్తె స్రవంతి వేడుకున్నారు. దీంతో తాజాగా నటుడు విశ్వక్‌షేన్ స్పందించి సాయం అందించారు. ఆయన పంపిన బ్యాంక్ చెక్‌ను ఫిష్ వెంకట్‌కు అందించారు. అందుకు సంబంధించిన వీడియోను షోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

సుమారు నాలుగేళ్లగా తన రెండు కిడ్నీలూ చెడిపోవడంతో డయాలసిస్ ద్వారా వెంకట్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రాణాలతో బయటపడాలంటే సుమారు రూ. 50 లక్షలు అవసరం అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. సినీ పెద్దలతో పాటు దాతలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని ఆమె కోరారు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ సాయం చేశారు. రూ. 2 లక్షల బ్యాంక్ చెక్‌ను తన టీమ్ ద్వారా ఆయన పంపారు. అందుకు ఫిష్ వెంకట్‌తో పాటు ఆయన కుమార్తె స్రవంతి కృతజ్ఞతలు తెలిపారు.