వైఎస్‌ జగన్‌ను కలిసిన సినీ నటుడు | Film Actor Fish Venkat Meets YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన సినీ నటుడు

Sep 18 2018 2:38 PM | Updated on Sep 18 2018 3:08 PM

Film Actor Fish Venkat Meets YS Jagan - Sakshi

సినీ న‌టుడు ఫిష్‌ వెంక‌ట్.. వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి సంఘీభావం తెలిపారు.

సాక్షి, విశాఖపట్నం‌: జన క్షేమమే తన క్షేమమంటూ జననేత వేస్తోన్న ప్రతి అడుగూ కష్టాల కడలిని ఎదురీదుతున్న ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. రేపటి ఆశలకు ఊపిరులూదుతోంది. కష్టాలతో కాలం గడుపుతున్న ప్రజలకు నేనున్నానంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. సినీ రంగానికి చెందిన ప‌లువురు న‌టులు వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి ఇదివ‌ర‌కే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

తాజాగా సినీ న‌టుడు ఫిష్‌ వెంక‌ట్.. వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి సంఘీభావం తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 265వ రోజు మంగళవారం ఉదయం వైఎస్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మార్గ‌మ‌ధ్య‌లో వెంక‌ట్ వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి మ‌ద్ద‌తు తెలిపి.. కొంత దూరం అడుగులో అడుగేశారు. వైఎస్ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement