
సినీ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో కచ్చితంగా ఒక కిడ్నీ అయినా మార్చాలని వైద్యులు చెప్తున్నారు. ఇందుకోసం రూ.50 లక్షలు అవసరమవుతాయన్నారు. అంత డబ్బు చెల్లించే ఆర్థిక స్థోమత తమకు లేదని వెంకట్ కుటుంబ సభ్యులు వాపోయారు. దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ మీడియా ముందుకు వచ్చారు.
విశ్వక్ సాయం
ఈ క్రమంలో హీరో ప్రభాస్ పేరు చెప్పి కొందరు ఆకతాయిలు వారికి సాయం చేస్తామని మాటిచ్చారు. తీరా అది ఫేక్ కాల్ అని తెలియడంతో వెంకట్ ఫ్యామిలీ మరోసారి సాయం కోసం అర్థించింది. నటుడి అనారోగ్యం గురించి తెలుసుకున్న హీరో విశ్వక్ సేన్ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేసి మంచి మనసు చాటుకున్నాడు.
ముందుకొచ్చిన మరో హీరో
తాజాగా మరో హీరో.. వెంకట్ పరిస్థితి చూసి చలించిపోయాడు. జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కృష్ణ మానినేని ఆధ్వర్యంలో, ఆయన స్థాపించిన సేవా సంస్థ 100 Dreams Foundation ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. వెంకట్ కూతురు స్రవంతికి ఆమేర డబ్బు అందించాడు.
అవయవదానం..
ఈ సందర్భంగా కృష్ణ మానినేని మాట్లాడుతూ.. 100 Dreams Foundationలో ఒక కార్యక్రమం అయిన పునరపి (అవయవ దానం అవగాహన కార్యక్రమం) మా ఆశయం మాత్రమే కాదు.. అవసరంలో ఉన్నవారికి జీవితం ఇవ్వాలన్న సంకల్పం. అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక్క నిర్ణయం – ఒక జీవితాన్నే మార్చేస్తుంది" అని తెలిపాడు.
చదవండి: ప్రముఖ నటి షోలో చనిపోయేందుకు ట్రై చేసింది: బిగ్‌బాస్ టీమ్