
పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు (hari hara veera mallu) ట్రైలర్ తాజాగా విడుదలైంది. 24 గంటల్లోనే తెలుగు ట్రైలర్‌కు 48 మిలియన్ల వ్యూస్ వచ్చాయని నిర్మాణసంస్థ తెలిపింది. ఇదే సమయంలో టాలీవుడ్ చరిత్రలోనే ఒక్కరోజులో అత్యధికంగా వ్యూస్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ వ్యూస్ అన్నీ ఫేక్ అంటూ సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. అందుకు సంబంధించిన పలు ఆధారాలు చూపుతూ కామెంట్లు చేస్తున్నారు.
'హరి హర వీరమల్లు' సినిమాను ఐదేళ్లకు పైగా నిర్మించారు. ఆపై పవన్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం.. విడుదల విషయంలో పలుమార్లు వాయిదా పడటంతో సినిమాపై బజ్ తగ్గింది. దీంతో ట్రైలర్ వ్యూస్‌తో బజ్ క్రియేట్ చేయాలని, అందుకోసం మేకర్స్ ఇలాంటి (యూట్యూబ్ వ్యూస్) ప్లాన్ వేశారని చెబుతున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఒక మిల్లీ సెకనులోనే సుమారు 1.7 లక్షల వ్యూస్ రావడం ఏంటి అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేరోజు రాత్రి 1 నుంచి 4గంటలలోపు ఏకంగా 11 మిలియన్ల వ్యూస్ 'వీరమల్లు'కు వచ్చాయని ఆధారాలు కూడా వైరల్ చేస్తున్నారు. 24 గంటల్లోనే 48 మిలియన్ల వ్యూస్ వస్తే ఆ తర్వాతి 24 గంటల్లో కేవలం ఒక మిలిన్ వ్యూస్ కూడా రాకపోవడం ఏంటి..? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ వచ్చేందుకు కొన్ని బాట్‌లను ఉపయోగిస్తారని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని చాలా వేదికల మీద నిర్మాతలు కూడా చెప్పారు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మొదటిరోజు కలెక్షన్లు రూ. 186 కోట్లు అని మేకర్స్ ప్రకటించారు. తర్వాత అదంతా ఫేక్ అని తేలడంతో మరుసటి రోజు నుంచి వారు కలెక్షన్లు ప్రకటించలేదు. ఇలా పలు ఉదాహరణలను గుర్తు చేస్తూ.. ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకోవడం అని చిత్రపరిశ్రమపై నెటిజన్లు మండిపడుతున్నారు. వీరమల్లు మాత్రమే కాదు. సినిమా ఏదైనా కావచ్చు.. బాగుంటే కాసుల వర్షం కురుస్తుంది. కథలో విషయం లేకుంటే ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా చివరకు మిగిలేది అపకీర్తి మాత్రమేనని గుర్తించాలి.
24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ సినిమాలు
హరి హర వీరమల్లు: 48 మిలియన్స్
పుష్ప2: 44.67M
గుంటూరు కారం: 37.68M
గేమ్ ఛేంజర్: 36.24M
సలార్: 32.58M
లియో: 31.91M
ది గోట్: 29.28M
బీస్ట్: 29.08M
సర్కారువారి పాట: 26.77M
తునివు: 24.96M
6) screen recording proof pic.twitter.com/UmgNcjl9aC
— YASHwAnth 🗡️ (@Yashwanth1674) July 4, 2025