Hotspot 2 Much Movie
-
OTT: నేటి తరం తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది
నాడు రాత్రిపూట మేడ మీద మన తాతలు, అవ్వలు చెప్పిన కథలు ఎంతో వినసొంపుగా ఉండేవి. అప్పట్లో విన్న ఆ కథల ముందు ఎంతటి సినిమాలైనా దిగదుడుపే. ఇప్పుటి తరానికి ఆ అదృష్టం లేదు. కాని నేటి దర్శకులు మాత్రం అప్పటి పెద్ద వారు చెప్పిన కథలలాగే తమ సినిమాలను తీర్చిదిద్ది ఇప్పటి తరం ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదే కోవకు చెందినది ఆహా వేదికగా స్ట్రీమ్ అవుతున్న హిలేరియస్ డ్రామా అయిన హాట్ స్పాట్ 2మచ్ సినిమా. ఈ సినిమా తప్పనిసరిగా నేటి తరాన్ని ఉద్దేశించినది. అందుకే వారి పరిభాషలో అర్థవంతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు విఘ్నేష్ కార్తీక్. నిజానికి హాట్ స్పాట్ సిరీస్ లో వచ్చిన రెండో భాగమిది. కాని మొదటిదానికి ఈ భాగానికి అస్సలు సంబంధం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఈ హాట్ స్పాట్ 2మచ్ సినిమా మూడు కథల సమాహారం. అభిమానం, పరువుల తో పాటు ప్రేమవంటి మూడు ప్రధానమైన అంశాలతో కూడిన కథలతో మన ముందుకొచ్చిన సినిమానే ఈ హాట్ స్పాట్ 2మచ్.అంతులేని అభిమానం ఎంతటి దారుణానికి దారి తీస్తుందో ఆపై వ్యక్తిగత స్వేచ్ఛ కుటుంబ పరువుకు ఎంత భారమవుతుందో అలాగే చిగురించని స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఇబ్బంది పెడుతుందో కూడా దర్శకుడు ఎంతో అందంగా ఈ సినిమాలో మలిచాడు. ప్రతి కథ ముగిసే ముందు వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసి స్ఫూర్తినిస్తాయి. మరీ ముఖ్యంగా మూడో కథ ఎక్కువ కల్పితంలా అనిపించినా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు మాత్రం మతి పోగొడుతుంది. అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. ఈ సినిమా ఇప్పటి, రేపటి తరం తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమిది. అలా అని సినిమా మొత్తం సందేశాలతో ఉండదు. నేటి, నాటి తరానికి వినోదమనే మసాలతో పసందైన సందేశాన్ని రుచికరమైన విందు రూపంలో వడ్డించాడు దర్శకుడు. మరింకెందుకాలస్యం హ్యావ్ ది డెలీసియస్ ఫన్ ఫీస్ట్ ఫర్ ది వీకెండ్-హరికృష్ణ ఇంటూరు -
తమిళ బోల్డ్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ
ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇతర భాషల చిత్రాలు కూడా స్ట్రీమింగ్‌లోకి వస్తుంటాయి. అలా గతవారం ఓటీటీలోకి వచ్చిన తమిళ బోల్డ్ మూవీ 'హాట్‌స్పాట్ 2 మచ్'. ఏకంగా ఆరు ఓటీటీల్లో ఒకేసారి అందుబాటులోకి వచ్చింది. అయితే అన్నింటిలోనూ ఒరిజివల్ వెర్షన్ మాత్రమే రిలీజైంది. తాజాగా ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కోసం డబ్బింగ్ రూపంలోనూ తీసుకురానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!)2024లో తొలి పార్ట్ రిలీజ్ కాగా ఈ ఏడాది థియేటర్లలో సీక్వెల్ రిలీజ్ చేశారు. ప్రియాభవనీ శంకర్ లీడ్ రోల్ చేసింది. మొత్తంగా మూడు బోల్డ్ స్టోరీలని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ వార్స్, డ్రస్సింగ్ సెన్స్, నిజమైన ప్రేమ అనే కాన్సెప్ట్స్‌ని షాకిచ్చే స్టైల్లో ప్రెజెంట్ చేశారు. తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు శుక్రవారం(ఫిబ్రవరి 27) నుంచి ఆహా ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.'హాట్‌స్పాట్ 2' విషయానికొస్తే.. శిల్ప(ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి ఓ నిర్మాత దగ్గరకు స్టోరీ నెరేషన్ ఇవ్వడానికి వస్తుంది. మూడు కథలు చెబుతుంది. వీటిలో మొదటిది హీరోలని పిచ్చిగా అభిమానించే ఓ ఇద్దరు కుర్రాళ్ల గురించి కాగా.. రెండోది డ్రస్సింగ్ సెన్స్ గురించి.. మూడోది టైమ్ ట్రావెల్ ప్రేమకథ. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. అసలు శిల్ప ఎవరు? ఈ నిర్మాత దగ్గరకే ఎందుకొచ్చింది? ఈ స్టోరీలు చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా 'హాట్‌స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)Three bold stories.One aspiring director.And a hidden agenda you won’t see coming. 👀#Hotspot2Telugu premieres from Feb 27 on aha. pic.twitter.com/znsJyTJLse— ahavideoin (@ahavideoIN) February 24, 2026 -
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీ సినిమాలు అనగానే అయితే రొమాంటిక్ లేదా థ్రిల్లర్స్ ఉంటాయిలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు డిఫరెంట్ స్టోరీలతో తీసిన మూవీస్ కూడా వస్తుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన తమిళ బోల్డ్ మూవీ 'హాట్‌స్పాట్ 2 మచ్'. 2024లో వచ్చిన తొలి పార్ట్ అందరికీ షాక్ ఇవ్వగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్ కూడా అదే రేంజులో ఆశ్చర్యపరిచింది. విఘ్నేశ్ కార్తిక్ దర్శకుడు కాగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.. లెస్బియన్ పాత్ర చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ సినిమా.. 'చథా పచ్చ' తెలుగు రివ్యూ)కథేంటి?తొలి భాగంలో ఓ నిర్మాతకు స్టోరీ చెప్పడానికి వచ్చిన మహమ్మద్ షరీఫ్(విఘ్నేశ్ రాజా).. స్టోరీలన్నీ చెప్పి చివరకు నిర్మాత కుమార్తెనే(బ్రిగిడ సాగా) పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే శిల్ప(ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి ఇదే నిర్మాత దగ్గరకు స్టోరీ నెరేషన్ కోసం వస్తుంది. ఓ మూడు కథలు చెబుతుంది. వీటిలో ఒకటి హీరోలని పిచ్చిగా అభిమానించే ఓ ఇద్దరు కుర్రాళ్ల గురించి కాగా.. రెండోది డ్రస్సింగ్ సెన్స్ గురించి.. మూడోది టైమ్ ట్రావెల్ ప్రేమకథ. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. అసలు శిల్ప, ఈ నిర్మాతకే స్టోరీ చెప్పడం వెనక ఓ ఉద్దేశం ఉంటుంది. ఇంతకీ అదేంటి? శిల్ప ఎవరు? షరీఫ్‌తో ఈమెకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సినిమా అంటే ఇలానే ఉండాలి. ఇలానే తీయాలి అని కొన్ని లెక్కలు ఉంటాయి. వాటిని బ్రేక్ చేస్తూ అప్పుడప్పుడు కొందరు దర్శకులు ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే 'హాట్‌స్పాట్'. 2024లో వచ్చిన ఈ సినిమాలో చిత్రవిచిత్రమైన అంశాల్ని చూపించగా.. ఈసారి సీక్వెల్లో మాత్రం సమాజంలోని హాట్ టాపిక్ లాంటి మూడు అంశాలని తీసుకుని వాటిని కన్విన్సింగ్‌గా చెప్పగలిగాడు. మెప్పించాడు కూడా.తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలని అభిమానించడం అనేది చాలా సాధారణమైన విషయం. అలా విపరీతమైన ఫ్యానిజం చూపించే ఇద్దరు కుర్రాళ్లకు.. ఓ అజ్ఞాత వ్యక్తి ఎలాంటి గుణపాఠం చెప్పాడు. వాళ్లకు ఎలా కళ్లు తెరిపించాడు అనేది తొలి స్టోరీగా చూపించారు. ఇందులో చెప్పిన పాయింట్స్ గానీ, చూపించిన అంశాలు గానీ పచ్చి నిజాలే. యువత తమ సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా హీరోలకు ఎలా బానిసత్వం చేస్తున్నారు? వాళ్ల సినిమాల రిలీజ్ టైంలో ఎలా కొట్టుకుచస్తున్నారనేది చూపించారు. చివరలో ఇచ్చిన ట్విస్ట్ అయితే ఆలోచన రేకెత్తించడంతో పాటు ఇలా ఉన్నారేంట్రా బాబు అనిపించేలా చేస్తుంది.రీసెంట్ టైంలో డ్రస్సింగ్ సెన్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం నటుడు శివాజీ.. స్టేజీపై హీరోయిన్ల డ్రస్సింగ్ స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయంలో చాలామంది శివాజీని తప్పుపట్టారు. మరికొందరు ఇతడిని సమర్థించారు. అసలు డ్రస్సింగ్ అంటే ఏంటి? ఈ కాలం ఆడపిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు? అనేది చూపించారు. ఇంటికొచ్చిన అతిథుల ముందు కూడా పొట్టిబట్టలేసుకుని కౌంటర్స్ వేసే ఓ కూతురికి.. వయసైన తండ్రి లాగిపెట్టి కొట్టేలా ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు అనేది పాయింట్ స్ట్రెయిట్‌గా చెప్పారు. ఇది చూస్తే కచ్చితంగా చాలామంది అమ్మాయిల ఆలోచనలో మార్పు వచ్చే అవకాశముంటుంది.ఇక మూడోది టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ. 2026లోనూ స్వచ్ఛమైన ప్రేమ కావాలనుకునే ఓ కుర్రాడికి అనుకోకుండా ఫోన్ కాల్ ద్వారా 2050లో ఉండే ఓ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. రోజూ ఫోన్లో మాట్లాడుతూ తెలియకుండానే ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ ఆమెకు ఇతడికి ఓ షాకింగ్ కనెక్షన్ ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఆ ట్విస్టుకి తొలుత ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చి స్టోరీని సుఖాంతం చేశారు. ఏదేమైనా ఈ మూడు స్టోరీలు ప్రస్తుతం సమాజంలో చాలామంది చూస్తున్న చేదు నిజాలే. కానీ కామెడీగా బోల్డ్ టచ్ ఇస్తూ చెప్పడం బాగుంది.పైన చెప్పిన మూడు కథలతో పాటు ప్రియా భవానీ శంకర్ చేసిన శిల్ప పాత్రకు ఓ స్టోరీ ఉంటుంది. అదేంటనేది ఇందులో పెద్దగా రివీల్ చేయలేదు. త్వరలో వచ్చే మూడో భాగంలో పూర్తిస్థాయిలో చూపిస్తారేమో?నటీనటుల విషయానికొస్తే.. ప్రియాభవానీ శంకర్, భవానీ శ్రీ, తంబి రామయ్య, ఎమ్ఎస్ భాస్కర్, బ్రిగిడ సాగా.. ఇలా ఎవరికి వాళ్లు తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్‌గానూ బాగుంది. ప్రస్తుతం తమిళంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పేరుకే బోల్డ్ సినిమా గానీ అసభ్యకర సన్నివేశాల్లాంటివి లేవు. వీలైతే ఒంటరిగానే చూడండి. కచ్చితంగా నచ్చుతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: సమంత నుంచి సర్ప్రైజ్.. పోస్ట్ వైరల్) -
తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా అప్పుడప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు కూడా వస్తుంటాయి. అలా 2024లో తమిళ వచ్చిన చిత్రం 'హాట్ స్పాట్'. మాట్లాడటానికే భయపడే కొన్ని కాన్సెప్ట్‌లని ఇందులో చూపించారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత డబ్బింగ్ కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా షాకయ్యారు. దీనికి 'హాట్‌స్పాట్ 2 మచ్' అని సీక్వెల్ తీయగా.. ఇది మాత్రం ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ఏకంగా ఆరు ఓటీటీల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? వేటిలోకి రానుంది?(ఇదీ చదవండి: ఏంటి ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా అని తారక్ నాతో..)సీక్వెల్లో ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రధారి కాగా.. బ్రిగిడ, భవానీ శ్రీ, తంబి రామయ్య తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. తొలి భాగాన్ని తీసిన విఘ్నేశ్ రాజా దీనికి కూడా దర్శకత్వం వహించాడు. గత నెల 23న థియేటర్లలోకి రాగా ఈ శుక్రవారం(ఫిబ్రవరి 20) నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రకటించారు. కాకపోతే అమెజాన్ ప్రైమ్, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా, లయన్స్ గేట్ ప్లే, షార్ట్ ఫ్లిక్స్ ఓటీటీ యాప్స్‌లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇదివరకు కొన్ని చిత్రాలు రెండు లేదా మూడింటిలోకి వచ్చాయి గానీ ఇలా ఒకేసారి ఆరింటిలో రానుండటం మాత్రం కచ్చితంగా విచిత్రమే.హాట్‌స్పాట్ 2 మచ్ విషయానికొస్తే.. సినిమా హీరోల పట్ల అభిమానం పిచ్చిగా మారిపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఒకదానిలో చూపించగా.. స్వలింగ సంపర్కుల వివాహం గురించి జరిగే చర్చ మరోదానిలో.. ఓ వ్యక్తి తనకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు, సమాజం చూసే చూపు తదితర అంశాలతో మూడో స్టోరీతో తీశారు. ఈ మూడింటికి ఎలాంటి ముగింపు ఇచ్చారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)


