
బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మను డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయారు. ఈ మాదకద్రవ్యాల రాకెట్ వెనుక నైజీరియా గ్యాంగ్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతని వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
కాగా.. అస్సాంకు చెందిన నటుడు విశాల్ బ్రహ్మ ఇండస్ట్రీలో అవకాశాల్లేక ఆర్థిక సమస్యల వల్లే ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం కొందరు స్నేహితుల నైజీరియా ముఠాతో పరిచయాలు ఏర్పడినట్లు సమాచారం. విశాల్ బ్రహ్మను కాంబోడియా ట్రిప్‌కు వెళ్లమని.. భారత్‌కు మాదకద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని ఆశ చూపినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
కాగా.. రెండు వారాల క్రితమే ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడు. రిటన్ జర్నీలో ఓ నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని, అందులోనే డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం. సింగపూర్ మీదుగా కాంబోడియా.. అక్కడి నుంచి చెన్నై.. చెన్నై నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లాలని నైజీరియా ముఠా అతనితో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. విశాల్ బ్రహ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటించారు.